– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: సర్కారు చేతిలో మరో నేతన్న బలి! ఇక నావల్ల కాదు అని దూస గణేష్ తన ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయాడు. సంవత్సర కాలంగా సాంచాలు సరిగా నడవకపోవడం వలన, ఉపాధి లేక, పని దొరకపోవడంతో అప్పులు తీర్చలేక వెళ్లిపోయాడు. సిరిసిల్ల ను మళ్లీ ఉరిసిల్ల గా మారుస్తున్న రేవంత్ రెడ్డి….వినిపిస్తున్నాయా ఆ చిన్నారుల ఆర్తనాదాలు? మార్పు అని ప్రగల్భాలు పలికిన నువ్వు వెళ్లి చెప్పు ఆ కూతుళ్లకు…ప్రభుత్వం కక్షసాధింపుల్లో క్షణం తీరికలేకుండా ఉంది అని! నేతన్నలైనా, రైతన్నలైనా తమ బిడ్డలను అనాథలు గా వదిలి వెళ్ళాల్సిందే అని! మరణ వాంగ్మూలాలు, అప్పుల చిట్టాలే….వారి బిడ్డలకి దక్కే ఆస్తులు అని!