– కాంగ్రెస్ నేతల భూ కబ్జాలకు హారతి
– రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి
– రేవంత్ చిప్పకూడు తిని అందరికీ చిప్పకూడు తినిపించాలనుకుంటున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: 75 లక్షల మంది రైతులు కోటి 50 లక్షల ఎకరాలకు ధరణి చట్టం హక్కులు కల్పించింది. ఈ రోజు ఆమోదించిన చట్టం భూ భారతి కాదు భూ హారతి ..కాంగ్రెస్ నేతల భూ కబ్జాలకు హారతి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి. భూ భారతి చట్టం రైతుల పాలిట పిడుగు పాటు లాంటిదే. ఇక రేపట్నుంచి పేదలకు కష్ఠాలు మొదలు.
కేవలం పది శాతం సమస్యలు కూడా లేని ధరణి చట్టం ను రద్దు చేయడం దారుణం. ధరణి తో పారదర్శకత పెరిగింది. 12 కోట్ల మంది ధరణి వెబ్సైట్ విసిట్ చేశారు. లక్షల ట్రాన్సక్షన్స్ జరిగాయి. అసెంబ్లీ లో పొంగులేటి పచ్చి అబద్దాలు ఆడారు. నిజాం తర్వాత తెలంగాణ లో భూమి నంతా 86 సంవత్సరాల తర్వాత కేసీఆర్ సర్వే (ఎల్ ఆర్ యూ పి )చేయించి హక్కు పత్రాలు ఇచ్చారు.
సీఎంఓ లో ఉన్న అధికారులందరూ ధరణి చట్టం లో పాలుపంచుకున్నవారే. వారిని కూడా రేవంత్ తప్పబడుతున్నారా? కేసీఆర్ తెచ్చిన సాఫ్ట్ వేర్ ను వాడుతూ రేవంత్ గత ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. 70 లక్షల మంది రైతులకు సంబంధించి కోటి 52 లక్షల ఎకరాలకు ధరణి లో చిన్న తప్పు కూడా దొర్లలేదు. 27 లక్షల ట్రాన్సాక్షన్లు జరిగిన ధరణి సాఫ్ట్ వేర్ లో లోపభూయిష్టాలు ఉన్నట్టా ? సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికపుడు అప్ డేట్ చేసుకోవాలి.
విదేశీ సంస్థల చేతిలో ధరణి సాఫ్ట్ వేర్ అనేది పూర్తి అబద్దం. జమాబందీ తిరిగి తెస్తున్నారు ఇది అక్రమార్కులకు పండగే. పౌతీ విధానం తేవడం తిరోగమన చర్య. కుటుంబం లో మళ్ళీ తగాదాలు మొదలవుతాయి. అనుభవదారు కాలమ్ పెడతారట ..రైతు కౌలు రైతు కొట్లాడాలి. కొత్త దుకాణాలు మొదలై భూ భారతి తో అవినీతి విచ్చల విడి అవుతుంది. ఎమ్మార్వో సంతృప్తి చెందితేనే మ్యూటేషన్ అనేది మరో అవినీతి దుకాణం. భూ భారతి తో రైతుల గుండె దడ మొదలైంది. భూ భారతి చట్టాన్ని బీ ఆర్ ఎస్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. రైతులతో కలిసి భూ భారతి పై పోరాటం చేస్తాం.
చెప్పులు ,బాటిళ్లతో మా పై దాడి చేశారు :ఎమ్మెల్యే కె .పి .వివేకానంద
అసెంబ్లీ సమావేశాలు ఓ పద్దతి లేకుండా నడుస్తున్నాయి. శాసన సభ చరిత్రలోనే కొత్త సంప్రదాయాలకు రేవంత్ తెర లేపింది. రూల్స్ కు వ్యతిరేకంగా సమావేశాలు నడుస్తున్నాయి. నియమాలు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారం సభ ను నడుపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలే నడప లేకపోతున్నారు. ఇక ప్రభుత్వాన్ని ఏం నడుపుతారు ? సీఎం అనుభవరాహిత్యం తో సమస్యలు వస్తున్నాయి.
సీఎం తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆరు గ్యారంటీలు ,420 హామీల నుంచి దృష్టి మరల్చడానికే రేవంత్ మా నేత కే టీ ఆర్ పై కేసు పెట్టారు. పన్నెండు నెలల్లో పన్నెండు విచారణలు చేశారు. రేవంత్ పాలన మీద దృష్టి పెట్టలేదు. ఫార్ములా ఈ రేసింగ్ తో రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది. కుంభకోణంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చర్చ కోసం పట్టుబడితే కాంగ్రెస్ సభ్యులు మా మీద దాడి చేశారు.
చెప్పులు ,బాటిళ్లతో మా పై దాడి చేశారు. ప్రతిపక్ష సభ్యులకు హక్కులుండవా? కొన్ని వీడియోలే కావాలని బయట పెట్టారు. సీఎం ప్రోద్బలం తోనే కాంగ్రెస్ సభ్యులు రెచ్చిపోతున్నారు. సీఎం కు దమ్ము లేదు కనుకే ఫార్ములా ఈ రేసింగ్ పై చర్చకు ఒప్పుకోలేదు. సీఎం కు చర్చ జరిగితే నిజాలు బయట పడుతాయి అని ఒప్పుకోలేదు. వీడియో లు ఎవరి అనుమతితో బయట పెట్టారు? కొత్త సంప్రదాయానికి తెరలేపారు. దీంట్లో కుట్ర కోణం ఉంది.
తెలంగాణ పరువు అంతర్జాతీయంగా పోయింది :ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఈ రోజు అసెంబ్లీ లో ఒక్క వ్యక్తి కోసం కొట్లాడలేదు. నాలుగు కోట్ల మంది ప్రజల కోసం కొట్లాడాం. తెలంగాణ పరువు అంతర్జాతీయంగా పోయింది. లండన్ లో ఫార్ములా ఈ తెలంగాణ ప్రభుత్వం పై కేసు వేసింది. కాంట్రాక్టు ఉల్లంఘన కేసు ప్రభుత్వం పై పెట్టడం రాష్ట్రానికి అవమానం. తెలంగాణ ప్రజల కోసమే స్పీకర్ పోడియం లోకి వెళ్లాం.
అసలు కే టీ ఆర్ పై పెట్టిన కేసు అక్రమ కేసు. రేవంత్ చిప్పకూడు తిని అందరికీ చిప్పకూడు తినిపించాలనుకుంటున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే చెప్పు చూపించిన వీడియో కూడా బయట పెట్టాలి. రేవంత్ వి డైవర్షన్ రాజకీయాలు.