కేసీఆర్ కాళ్లు మొక్కి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మంగళవారం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. గతంలోనూ కలెక్టర్ గా రూల్స్ బ్రేక్ చేశాడన్నారు. “అప్పట్లో చిత్తూరు జిల్లా తాగునీటి పథకంలో పెద్ద అవినీతి జరిగింది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రులను మెప్పించి ప్రమోషన్స్ పొందడం వెంకట్రామిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కేసీఆర్ మెప్పుపొంది ఎమ్మెల్సీ పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో వెంకట్రామిరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.
కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చిత్తూరు జిల్లా తాగునీటి పథకంలో రూ.7 వేల కోట్ల స్కాం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో వెంకట్రామిరెడ్డిపై హరీష్ రావు అప్పట్లో ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడికి వెంకట్రామిరెడ్డి అత్యంత సన్నిహితుడు. కోర్టు ఉల్లంఘన కేసులున్న వెంకట్రామరెడ్డి రెడ్డి.. టీఆర్ఎస్ కు బంట్రోతుగా మారి పనిచేసిండు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ రాష్ట్ర పతికి కూడా వెంకట్రామిరెడ్డి పై పిర్యాదు చేసిండు. రాష్ట్రపతి నుండి సీఎస్ కు చర్యలు తీసుకోమని లేఖ వచ్చినా పట్టించుకోలేదు. వెంకట్రామిరెడ్డికి చెందిన రాజ్ పుష్పా సంస్థ కొకాపెట భూములను దక్కించుకుంది. దాంట్లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది.
భూముల అమ్మకాల విషయంలో.. అక్రమాలు జరిగాయి. దానిపై Mstc, Hmda, వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం. అయినా పట్టించుకోవడం లేదు. సర్వీస్ లో ఉన్న ఇలాంటి అవినీతి అధికారులపై విచారణ చేయాలి. నిన్న వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయగానే.. ఇవ్వాళ ఎమ్మెల్సీని చేసిండు కేసీఆర్. ఇక రేపో మాపో ఫైనాన్స్ మినిస్టర్ గా నియమిస్తారని ప్రచారం అవుతుంది. ఇలాంటి వాళ్ల కోసమేనా తెలంగాణ వచ్చింది. తెలంగాణ ద్రోహులను పాలకులుగా నియమించడం ఏంటని” సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.