-ఇవాళ ఆంద్రప్రదేశ్ నుంచి వచ్చి చేరిన ఇంట్లో కూడా తిండి పెట్టారు
-తెలంగాణ మంత్రులను, ఎమ్మెల్యే లను,ప్రజలను కేసీఆర్ కలవరు కానీ పక్క రాష్ట్రం వాళ్ళను కలుస్తున్నారు
-మోగా కృష్ణారెడ్డి,ప్రతిమ కి బిల్స్ చెల్లించారు
-రాష్ట్రంలో బీహార్ అధికారుల రాజ్యం
-కేసీఆర్ బీహార్ కి పారిపోతారు
-మంత్రులను అడ్డుకోవాలని సర్పంచ్ లకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపు
‘‘కేసీఆర్ ఆంధ్రా పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనపై చెప్పుల దాడి జరిగితే, అప్పుడు తెలంగాణ వాళ్లంతా ఏకం కావాలని పిలుపునిస్తారు. ఇప్పుడేమో ఏపీ నుంచి వచ్చిన లీడర్లకు భోజనం పెడుతున్నారు. ఆయన తాను బీహారీనని ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కూడా బీహార్ అధికారుల రాజ్యమే నడుస్తోంది. అందుకే కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు’’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయనీరాజ్ నిధులను పకకదారి మళ్లించి, దానిని నిర్వీర్వం చేసిన కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి, ప్రతిమ కంపెనీలకు మాత్రం బిల్లులు చెల్లిస్తున్నారని వెల్లడించారు. అయ్యప్పస్వామిని తిట్టడం వెనుక బీజేపీ-బీఆర్‌ఎస్ మ్యాచ్‌ఫిక్సింగ్ ఉందని ఆరోపించారు. బొల్లారం పోలీసుస్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ ఇంకా ఏం మాట్లాడారంటే… పంచాయతీ ల పరిపాలన నిధులు విధులు సర్పంచ్ లకు కట్టబెట్టారు.గ్రామం అభివృద్ధి నిధులను సర్పంచ్ లకు ఉప సర్పంచ్ కి కట్టబెట్టారు.కేసీఆర్ గ్రామ పంచాయతీ ల హక్కలను ఆయన చేతిలో పెట్టుకున్నారు.గ్రామ పంచాయతీ ల నిధులు ఆలస్యం చేయమని కేసీఆర్ అసెంబ్లీ లో చెప్పారు 35 వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగలించింది.
కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు.గ్రామ పంచాయతీ లు నిర్వీర్యం అయ్యవి.ఏ తండా లో అయిన గ్రామ పంచాయతీ భవనాలు కట్టించారా?గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. విద్యుత్ పైసలు కూడా దొంగిలించారు కేసీఆర్.సిరిసిల్ల జిల్లాలో ఆనంద్ రెడ్డి 40 లక్షల అప్పు చేసి పని చేస్తే…నిధులు ప్రభుత్వం ఇవ్వక పోవడం తో ఆత్మహత్య చేసుకున్నాడు. మునుగోడు, సూర్యపేట్ లో మహిళ సర్పంచ్ పుస్తె అమ్ముకుంది. గ్రామ పంచాయతీ ల నిధుల విషయంలో హక్కులను ఉల్లంఘిస్తుంది. మోగా ,ప్రతిమ కి బిల్స్ చెల్లించారు కేసీఆర్.15 వ ఫైనాన్స్ కమీషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొట్టింది. పంచాయతీ రాజ్ వ్యవస్థ కొల్లగొట్టారు.కాంగ్రేస్ పార్టీ సర్పంచ్ లకు అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు.కాంగ్రెస్ ధర్నా చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది?
మా కాంగ్రెస్ నాయకుల పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు..అలాంటి పోలీసులను గుర్తు పెట్టుకుంటాం.శాసనసభలో ఇచ్చిన హామీ ప్రకారం సర్పంచ్ లకు నిధులు ఇవ్వాలని డిమాండ్.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడి సర్పంచ్ లను ఇబ్బంది పెడుతున్నారు. కోర్టు కి వెళ్లి ఇందిరా పార్కు వద్ద సర్పంచ్ ల పక్షాన ధర్నా చేస్తాం.మంత్రులను నిలదీస్తే మీ పైసలు వస్తవి. చంద్రశేఖర్ రావుకు మతి పోయింది. కొన్ని పార్టీలు ఇక్కడ తిరిగిన ప్రశ్నించలేదు. 2008 లో పార్లమెంట్ సభ్యుడు గా రాజీనామా చేసిన సమయం బీహార్ నుంచి వలస వచ్చామని కేసీఆర్ చెప్పాడు. బీహార్ కాబట్టే బిఅరెస్ పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో బీహార్ కి చెందిన అధికారుల రాజ్యం నడుస్తుంది. కేసీఆర్ బీహార్ కి పారిపోతారు. బీజేపీ కూడా కేసీఆర్ కి సహకారం అందిస్తుంది.
అయ్యప్ప పై కామెంట్ లు చేసిన వెనుక రాజకీయ వ్యూహం ఉన్నది. అయ్యప్ప స్వామి ని తిట్టడం వెనుక టీఆరెస్ బీజేపీ పార్టీలు ఉన్నవి.నా నియోజకవర్గంలో వెళ్లి మాట్లాడాడు. డిసెంబర్ 19 నా మాట్లాడితే ఇన్ని రోజులు ఏం చేశారు?ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల ను చీల్చడం కోసం.ప్రశాంత్ కిషోర్ ఇలా చేస్తున్నారు.కాంగ్రెస్ లో నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ల పై విచారణ చెప్పట్టాలని కేంద్రానికి కోరాం స్పందన లేదు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో సభ పెడితే చెప్పు వేస్తే తెలంగాణ ప్రజలు ఏకం కావాలని అంటారు. ఇవాళ ఆంద్రప్రదేశ్ నుంచి వచ్చి చేరిన ఇంట్లో కూడా తిండి పెట్టారు. తెలంగాణ మంత్రులను, ఎమ్మెల్యే లను,ప్రజలను కేసీఆర్ కలవరు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళను కలుస్తున్నారు.. ఉమ్మడి శత్రువులను తిప్పి కొట్టడానికి టీఆర్ఎస్ బీజేపీ వ్యూహం.