– గురుకులాల్లో 49 మంది విద్యార్థులు చనిపోవడం నువ్వు తెచ్చిన మార్పు
– టీజీ చేయడం, తెలంగాణ తల్లిని మార్చడం కాదు
– తెలంగాణ ద్రోహ చరిత్ర నీది రేవంత్ రెడ్డి
– సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి: వంద ఎలుకలు తిన్న రాబందు తీర్థయాత్రలకు పోయినట్లు, దయ్యాలు వేదాలు వల్లించినట్లు రేవంత్ రెడ్డి వైఖరి ఉంది.ఒక్కనాడు జై తెలంగాణ అనలేదు, అమరవీరులకు పువ్వు పెట్టింది లేదు. ఉద్యమంలో ఏనాడూ పాల్గొన్న వ్యక్తి కాదు.
డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితం ఎవరో దయ వల్ల తెలంగాణ వచ్చింది అనడం ఉద్యమ కారులను, తెలంగాణ వారిని అవమానించడమే. తెలంగాణకు అడుగడుగునా అడ్డు పడ్డది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ది ద్రోహాల చరిత్ర.
2001లో కేసీఆర్ పార్టీ పెట్టకుంటే, పోరాటం చేయకుంటే అసలు తెలంగాణ మాటే లేదు. 2004లో హామీ ఇస్తే కేంద్ర క్యాబినెట్ లో చేరారు. తెలంగాణ ఇవ్వక పోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేశారు.కేంద్రంలో మంత్రిగా ఉండి ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్ యూ ఆఫీసు దాకా తిరిగిండు. దేశంలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి ప్రణబ్ ముఖర్జీ కి లేఖ ఇచ్చింది కేసీఆర్.
చివరకు కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామ చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ పోరాట ఫలితం కాదా? చిదంబరం జయశంకర్ కి ఫోన్ చేసారు. జయశంకర్ , కేసీఆర్ రాసి ఇచ్చిందే చిదంబరం చదివారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయిందని ప్రకటించారు. నవంబర్ 29 లేకుంటే, డిసెంబర్ 9 లేదు, ఇవి లేకుంటే జూన్ 2 తెలంగాణ ఏర్పాటు లేదు.
చంద్రబాబును ఎవరు నిలదీస్తున్నరు అని రైఫిల్ పట్టుకొని ఉద్యమ కారుల మీదికి వెళ్లింది ఈ రైఫిల్ రెడ్డి. రాజీనామాలకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది. వంట వార్పులో, రైలు రోకోలో, మిలియన్ మార్చులో, సకల జనుల సమ్మెలో, సాగర హారంలో రేవంత్ రెడ్డి లేడు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఉద్యమం గురించి
నీ ద్రోహ చరిత్ర, రెండు కళ్ల సిద్దాంతం సేవలో ఉన్నవు. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. రేవంత్ రెడ్డి మీద ఒక్క కేసు అయినా ఉన్నదా?
నాడు సోనియా బలి దేవత అన్నడు, నేడు దేవత అంటున్నడు. నాడు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసాడు, వెన్నుపోటు పొడిచాడు. వక్రీకరించిన మాత్రాన తెలంగాణ చరిత్ర చెరిగిపోదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడా పెట్టలేదని రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటు. అవగాహనరాహిత్యం. సంగారెడ్డి కలెక్టరేట్ లోనే జూన్ 2, 2015 నాడు నేను, ఎమ్మెల్యే, కలెక్టర్ రాహుల్ బొజ్జా కలిసి విగ్రహం ఆవిష్కరించాం.
అమరుల స్తూపం కూడా ఆవిష్కరించాం.
సచివాలయం ముందు అమరుల స్తూపం ముందు తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. భారత మాతను ఏ పార్టీ మార్చలేదు.
మార్పు మార్పు అని ఏం చేసావు?
కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రీషన్ కిట్టు బంధు, దళిత, బీసీ, రైతు బంధు బంద్ పెట్టినవు. గురుకులాల్లో 49 మంది విద్యార్థులు చనిపోవడం నువ్వు తెచ్చిన మార్పు. టీజీ చేయడం, తెలంగాణ తల్లిని మార్చడం కాదు తెలంగాణ ద్రోహ చరిత్ర నీది రేవంత్ రెడ్డి.