– అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
హైదరాబాద్: అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రహసనంగా మార్చేసింది అన్ని వ్యవస్థలను సీఎం రేవంత్ నిర్వీర్యం చేశారు. శాసనసభ రూల్ బుక్ ప్రకారం నడవడం లేదు. లగచర్ల రైతులకు బేడీలపై రెండు రోజులుగా చర్చకు పట్టుబడుతున్నాం.. ప్రభుత్వం పారిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి వార్తలను లీకులిచ్చి బతుకుతున్నారు.
కేసులు, అరెస్టులు అంటూ నాలుగు గోడల మధ్య ఉండి రేవంత్ వార్తలు రాయిస్తున్నారు. చర్చకు రేవంత్ మొహం చాటేస్తున్నారు. శాసనసభకు వచ్చే మొహం లేదు. ఫార్ములా-ఈ మీద దమ్ముంటే చర్చ పెట్టండి. కాంగ్రెస్ మోసాలపై చర్చకు సిద్ధం. దమ్ముంటే శాసనసభను పదిహేను రోజులు నడపండి.బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రతి పనిని చర్చిద్దాం.
ఆసెంబ్లీలో మా గొంతు నొక్కవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో నొక్కలేరు. రాష్ట్రంలో పోలీస్ పాలన నడుస్తోంది. అన్నిటికి ఎదురొడ్డి ప్రజల పక్షాన పోరాడతాం. సీఎం దొంగరాతలు, తప్పుడు రాతలు పత్రికల్లో రాపిస్తున్నారు నేరుగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు.