– 82 శాతం జీవోలను దాచి పెట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?
– ప్రభుత్వం దాచి పెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల లోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు
– ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు రేవంత్ రెడ్డి.. చీకటి జీవోల మాటున నువ్వు దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. జీవోలు దాచుతూ చేస్తున్న డ్రామా..RTI సమాధానం ఆధారంగా మా పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు హైకోర్టులో వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తో బట్టబయలు కాబోతున్నది. 07-12-2023 నుంచి 26-01-2025 వరకు అంటే మొత్తం 13 నెలల్లో 19,064 జీవోలు జారీ చేయగా, వాటిలో కేవలం 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉంచడంలో అంతర్యం ఏమిటి? ఒక్క ఏడాదిలో 15,774 జీవోలు అంటే 82 శాతం జీవోలను దాచి పెట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? రేవంత్ రెడ్డి ఇదేనా మీరు చెప్పిన ప్రజా ప్రభుత్వం?