తెలంగాణ రాకుంటే అమెరికాలో బాత్ రూమ్లు కడుక్కుని బతికేవాడివి
రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్
తెలంగాణ ఇవ్వకపోతే.. మీరు బిచ్చం ఎత్తుకుని బతికేవాళ్ళు
పెద్దపల్లి విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. “రాహుల్ గాంధీ ఎవరూ అని అడుగుతున్న సన్నాసి కేటీఆర్. ఆ కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలి. గాంధీ కుటుంబానికి ఉండటానికి ఇళ్ళు లేని పరిస్థితి ఉంటే, పదేళ్లలో ఫామ్ హౌజ్ లు కట్టుకున్న చరిత్ర..ఇంత బలుపు ఎందుకు కేటీఆర్? తెలంగాణ రాకుంటే అమెరికాలో బాత్ రూమ్లు కడుక్కుని బతికేవాడివి” అని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేస్తే నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. సోనియా గాంధీ, సోనియా గాంధీలకు ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించారని తెలిపారు.
పెద్దపల్లిలో గురువారం నిర్వహించిన విజయభేరి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా నో, బిర్లా మందిర్ వద్దో బిచ్చం అడుక్కునేది. ఇవాళ లక్ష కోట్లు, వేలాది ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ చెప్పాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడివి? హైదరాబాద్ చుట్టూ లక్ష కోట్ల రూపాయల ఆస్తులు పోగు చేసుకున్నది కేసీఆర్ కుటుంబం అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
“60 ఏండ్లు దేశాన్ని ఏలిన గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు.. కానీ పదేళ్లు ప్రభుత్వంలో ఉండి వందల ఏకరాలు కొన్నది మీరు.. వంద ఎకరాలు.. ఫామ్ హౌస్ కట్టుకున్నది నువ్వు.. కేటీఆర్ అంత బలుపు పనికి రాదు. రాహుల్ గాంధీని నువ్వేవరు అని అడిగేంత బలుపు అవసరమా.. రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్ అంటూ” రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇంత బలుపు ఉన్న నాయకులు అవసరమా? మనకు అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్టం ఇచ్చింది. రాహుల్ గాంధీ ఎవరు అని అడుగుతున్నారు సన్యాసులు.. రాహుల్ కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగం చేసింది.. 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి.. రాష్ట్రాన్ని కొల్లగొట్టారు.. మీకు రాహుల్ ఎవరు అనే అర్హత ఎక్కడిది అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
పందికొక్కుల్లా లక్షల కోట్లు దోచుకున్న మీరు రాహుల్ గాంధీ ఎవరని ప్రశ్నిస్తారా? అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను నట్టేట ముంచిన కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు. ఉద్యోగాలు రాక ఆడ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే అవహేళన చేస్తున్నారు. కేసీఆర్ మరో సారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, నెట్టెంపాడు వంటి భారీ ప్రాజెక్టులు, హైదరాబాద్కు ఐటీ ప్రాజెక్టులు, విమానాశ్రయం, మెట్రో రైలు మంజూరు చేసింది ఎవరు? తెలంగాణకు జవహార్ లాల్ నెహ్రూ స్వాతంత్య్రం తెచ్చారు. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేశారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించిన మహానుభావుడు రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తామన్నారు. ఆరు గ్యారెంటీలలో భాగంగా రూ. 500కే సిలిండర్ ఇస్తామన్నారు. ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్ధిక సాయం చేస్తాం. రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు రూ.12వేలు అందించనున్నాం.
పెన్షన్ రూ.4వేలు అందించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ. 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ ఇవ్వాలంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి విజయరమణారావును 50వేల మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.