Suryaa.co.in

Telangana

ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయనపై మూడు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్, బేగంబజార్ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు హాజరయ్యారు.

రేవంత్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ కోర్టుకు తెలిపారు.

LEAVE A RESPONSE