– వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళతామన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
– మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకొని వెళుతున్నా
– సీబీఐలో కొంత లొసుగులు ఉన్న మాట వాస్తవమే
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ముందుకు సాగుతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్ రెడ్డే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకొని వెళుతున్నామని తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రమశిక్షణ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని అన్నారు.