Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డి ది.. కేసీఆర్ కు మించిన నియంత పాలన

– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి పది సంవత్సరాలు.. దొరలు, దురహంకార పాలనలో ఉండేది.బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన బీజేపీ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రత్యామ్నాయ వాతావరణం తీసుకువచ్చింది.

అయితే ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. ప్రజాతీర్పును ఆమోదించినం.ప్రజామోదయోగ్యమైన పాలన ఇప్పటికైనా ప్రజాస్వామ్యం నిలబడుతుందని కోరుకున్నాం.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరల పాలన, అప్రజాస్వామిక పాలన నడిచిందో.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే తరహా పాలన నడుస్తోంది. నాడు ధర్నా చౌక్ ను ఎత్తివేసి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను నొక్కేసింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హక్కుల కోసం పోరాడిన వారి గొంతు నొక్కుతోంది.

బీఆర్ఎస్ దొరల పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ కు పదిరెట్లు దొరస్వామ్యం చూపెడుతున్నాడు.

వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నిరసన తెలిపిన విద్యార్థులకు మద్దతు తెలిపిన ఏబీబీపీ కార్యదర్శి ఝాన్సీపై పోలీస్ లు వ్యవరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. వ్యవసాయ యూనివర్సిటీ భూములను హై కోర్టుకు కేటాయించవద్దని ఏబీవీపీ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోంది.

విద్యార్థులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలు బాగుపడుతారని జయశంకర్ సార్ పేరుతో స్థాపించిన యూనివర్సిటీలో విద్యార్థులను చెల్లాచెదురు చేసి పోలీసులు దాడికి పాల్పడటం హేయమైన చర్య.ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నాం. ఝూన్సీ ని జుట్టు పట్టుకుని లాక్కెళుతూ దాడికి పాల్పడటం దారుణం.

ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ స్పందించాలి. ఇదేనా కాంగ్రెస్ పరిపాలన తీరు..? ఏబీవీపీ నాయకురాలిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిన పోలీసులపై ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు..?

విద్యార్థి నాయకురాలపైనే పోలీసులు ఇలా వ్యవరిస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటీ? నరేంద్ర మోదీ గారి పాలనలో భారతదేశంలో త్రివిధ దళాల్లో మహిళా ప్రాతినిధ్యం కల్పించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జరిగే పరేడ్ లో మహిళా సిబ్బంది పాల్గొననుంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి గౌరవించింది.తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ మహిళల పట్ల విచక్షణారహితంగా వ్యవహరిస్తోంది. క్రైమ్ రేటులో దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో ఉంది.

మహిళలపై దాడులు, అరాచకాలకు కారణమవుతున్న బెల్ట్ షాపులను రద్దు చేయడమే కాకుండా ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఉద్యమాలు చేసే మహిళలపైనే దాడులు జరుగుతున్నాయంటే తెలంగాణలో పాలన దారుణంగా ఉంది.

ఏబీబీపీ కార్యదర్శి ఝాన్సీపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఘటనపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాలి.

LEAVE A RESPONSE