– ఆయన వ్యాఖ్యలు సీఎం పదవికి కళంకం
– రేవంత్ పుట్టినిల్లు బి.ఆర్.ఎస్ పార్టీ అని మరవద్దు
– సీనియర్ శాసన సభ్యులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
– మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి: ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు హుందాతనాన్ని కాపాడాలి…ప్రతిపక్షాలను గౌరవించాలి. అహంకారంతో మాట్లాడితే అంతం కాక తప్పదు. అసెంబ్లీ సాక్షిగా అక్కలను నమ్ముకుంటే మునుగుతారు,బతుకు బస్ స్టాండ్ అవుతుందని అవమానించిడం తప్పు.
మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాక రైతులు,నిరుద్యోగులు, అగన్వాడి టీచర్లు,ఆశా కార్యకర్తలు,ఆరోగ్య కార్యకర్తలు,ఆటో యూనియన్ కార్మికులు ఒకవైపు ఆందోళనలు చేస్తుంటే వారి దృష్టి మారాల్చడానికి సంబంధం లేకుండా రాజకీయ ప్రేరిపిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.
క్షుద్రరాజకీయాలే శరణ్యంగా ఉన్న రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి మునిగిపోవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి బేరసారాలు ఆడుతున్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు. గతంలో చట్టబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ విపక్ష ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.హోల్ సేల్ గా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.
రాజకీయాలలో ఓటమి గెలుపులు సహజం .. అహంకారం పనికిరాదు. 2018ఎన్నికలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్న మాటకు రేవంత్ కట్టుబడి ఉన్నడా ? పాలన శూన్యం చేసి హామీలు అటకెక్కించి కాలయాపన చేస్తూ నమ్మిన ప్రజలను మోసం చేశారు. వెంటనే సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు రాష్ట్ర మహిళలందరికీ రేవంత్ క్షమాపణలు చెప్పాలి.