– మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
రేవంత్, ఖర్గే, ప్రియాంక ధర్నాకు ఎందుకు ముఖం చాటేశారు
– మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
హైదరాబాద్: కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు కాంగ్రెస్ తీరు ఉంది. ఢిల్లీకి వెళ్లి ఏదో చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. అసెంబ్లీ, మండలిలో బిల్లు చర్చకు వచ్చినప్పుడు నిరభ్యంతరంగా మేము మద్దతు తెలిపాము. తమిళనాడు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ఏ విధంగా 9వ షెడ్యూల్ లో చేర్చారో అట్లాగే తెలంగాణలో చేయాలని చెప్పాము.
ప్రభుత్వం తరపున ఢిల్లీకి వెళ్తున్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, నాకు చెప్పారా? మమ్మల్ని ఢిల్లీకి తీసుకువెళ్తే వాళ్ళ మోసం బయటపడుతుందని అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళలేదు. మోదీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని బీసీ రిజర్వేషన్ల ధర్నాలో రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఎండగడతాము.
కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఈ నెల 14వ తేదీన కరీంనగర్ లో బిఆర్ఎస్ బీసీ గర్జన సభ ఉంటుంది. నిన్న,మొన్న ఢిల్లీలో డ్రామా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు
42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ చెప్పింది. బీసీలకు లక్ష కోట్లు బడ్జెట్ పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
హడావుడిగా కులగణన చేశారు. తొందరపాటుతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ఏదో జరిగినట్లు సంబురాలు చేసుకున్నారు. మొన్న,నిన్న,ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ డ్రామాలు చేస్తోంది. జంతర్ మంతర్ ధర్నాకు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,మల్లిఖార్జున ఖర్గే ఎందుకు రాలేదు?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే బీసీల సత్తా ప్రభుత్వానికి చూపుతాము. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? మేము చట్టం ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాము.
మండల యూనిట్, జిల్లా యూనిట్, రాష్ట్ర యూనిట్ తీసుకుంటారా అనేది మాకు అనవసరం. ఢిల్లీలో ఇండియా కూటమి మొత్తం వస్తుందని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ జంతర్ మంతర్ ధర్నాకు రాలేదు. మమ్మల్ని అఖిలపక్షంగా పిలిస్తే మేము వస్తామని సీఎంకు చెప్పాము. ఓపెన్ గా పిలవడం ఎక్కడైనా ఉంటుందా?
రెవెన్యూ, హోంశాఖ బీసీలకు ఇవ్వాలి: మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
రిజర్వేషన్లు పెంచితే 50 శాతం లోబడి ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును కేసీఆర్ అమలు చేశారు. తమిళనాడు సీఎంగా జయలలిత ప్రధానమంత్రిని, అన్ని పార్టీలను ఒప్పించి రిజర్వేషన్లు సాధించారు. ప్రభుత్వం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి. గవర్నర్ కు విద్య,ఉద్యోగాల్లో ఆర్డినెన్స్ ఎందుకు పంపలేదు? బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోంది.
మిగిలిన మూడు మంత్రి పదవులను బీసీలకు ఇవ్వండి. రెవెన్యూ, హోంశాఖ బీసీలకు ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్ పదవులను బీసీలకు 42శాతం ఇవ్వాలి. బీసీలకు నామమాత్రమైన శాఖలను ఇచ్చారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలి.