– టెన్త్ క్లాస్ విద్యార్ధులు, తల్లిదండ్రులతో ముఖాముఖిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
జగన్ రెడ్డి రివర్స్ పాలన వల్లే టెన్త్‌లో రివర్స్ రిజల్ట్స్ వచ్చాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. దారుణ ఫలితాల తీరుపై బుధవారం జూమ్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు. ముందుగా టెన్త్‌లో ఫెయిలైన పదవ తరగతి విద్యార్ధులకు నివాళులు నారా లోకేష్ అర్పించించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి నారా లోకేష్ మాటల్లోనే…
టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చూసిన తరువాత షాక్ కి గురయ్యాను. కనీస అవగాహన లేని వ్యక్తి సీఎం అయితే ఎంత ప్రమాదమో చూస్తున్నాం. జగన్ రెడ్డి మూర్ఖత్వంతో విద్యా వ్యవస్థను నాశనం చేసారు. టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసి పరీక్షలు రాసిన జగన్ రెడ్డికి విద్యార్థుల కష్టం ఏం తెలుస్తుంది? పరీక్షల నిర్వహణ నుండి రిజల్ట్స్ ప్రకటించే వరకూ అంతా గందరగోళమే. పరీక్షల సమయంలో కూడా కరెంట్ కోతలు పెట్టిన చెత్త ప్రభుత్వం ఇది. ఫెయిల్ అయ్యింది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కాదు…జగన్ సర్కార్ ఫెయిల్ అయ్యింది. నాడు (2018) టిడిపి ప్రభుత్వం నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో 94.48 శాతం పాస్ పర్సంటేజ్ వచ్చింది. నేడు జగన్ రెడ్డి పాలన లో 67.26 శాతం పాస్ పర్సంటేజ్. గత 20 ఏళ్లలో ఇదే అతి తక్కువ పాస్ పర్సంటేజ్. 71 ప్రభుత్వ స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాకపోవడం దారుణం. రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం ఏంటి అని అందరూ బాధపడుతుంటే జగన్ రెడ్డి గారు మాత్రం హ్యాపీగా వేల కోట్లు అమ్మ ఒడి డబ్బులు మిగిలాయని సంబరాలు చేసుకుంటున్నారు.
నాడు- నేడు లో భారీగా అవినీతికి పాల్పడి ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. నాడు- నేడు లో స్కూళ్లు బాగుపడలేదు… వైసిపి నాయకులు బాగుపడ్డారు. విద్యార్ధుల పేరుతో ఏపీ ముఖ్యమంత్రి రూ.3500 కోట్లు కొట్టేసారు. నాడు నేడు పనులు జరిగిన పాఠశాలల్లో పైకప్పు ఊడి పిల్లల తలలు పగులుతున్నాయి. నాడు- నేడు పనులు ఎంత గొప్పగా చేసారో అర్ధం అవుతుంది. ఉపాధ్యాయులు దేవుడితో సమానం. అందరూ గురువుల్ని గౌరవిస్తాం. కానీ మూర్ఖుడు జగన్ రెడ్డి గురువులను ఘోరంగా అవమానించాడు. మద్యం షాపుల ముందు ఉపాధ్యాయులను కాపలా పెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. చదువు చెప్పాల్సిన టీచర్ల ను జగన్ రెడ్డి టార్చర్ చేసారు. మరుగు దొడ్ల ఫోటోలు తియ్యాలి యాప్ లో అప్ లోడ్ చెయ్యాలి, భోజనాల ఫోటోలు తియ్యాలి యాప్ లో అప్ లోడ్ చెయ్యాలి. నాడు- నేడు టీచర్ల పనా? మరి విద్యార్థులకు చదువు ఎవరు చెబుతారు? వేల కోట్లు ప్రజాధనం వృధా చేస్తూ కార్యకర్తలకు వాలంటీర్ పదవులు ఇచ్చుకున్నారు కదా వాళ్ళతో ఫోటోలు అప్ లోడ్ చేయించుకోవచ్చు కదా? వారంలో సిపిఎస్ రద్దు చేస్తా, అదిరిపోయే పీఆర్సీ ఇస్తా అని హామీ ఇచ్చి ఉపాధ్యాయులను మోసం చేసారు. ఉపాధ్యాయులను ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. హక్కుల కోసం పోరాడిన ఉపాధ్యాయుల పై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి చెత్త నిర్ణయాల వలన చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడెక్కి పోరాటాలు చెయ్యాల్సిన దుస్థితి వచ్చింది. ప్రతీయేటా మెగా డియస్సీలో టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. మూడేళ్లలో ఒక్క కొత్త టీచర్ ని కూడా నియమించలేదు. విద్యార్థులకి చదువు చెప్పే టీచర్లు లేకే ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయి. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఎయిడెడ్ పాఠశాలల రద్దు చేయవద్దని మేం పోరాడినా రద్దు చేశారు. పరీక్ష పత్రాల తయారీ ఏకపక్షంగా తీసుకువచ్చారు.
అమ్మ ఒడి ఇవ్వడానికి నిధుల్లేక-అప్పులు దొరక్క ఇప్పటికే వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం లబ్ధిదారులను తగ్గించే కుట్రలో భాగంగానే టెన్త్ ఫలితాల్లో అత్యధికుల్ని ఫెయిల్ చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 10వేల మంది విద్యార్ధులను ఫెయిల్ చేసింది. టెన్త్ అతి ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితోపాటు ఇంటర్-పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి వస్తుందని కుట్రతోనే అతి ఎక్కువమందని ఫెయిల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. టిడిపి ప్రభుత్వహయాంలో నిరంతర పర్యవేక్షణ , డీయస్సీలద్వారా టీచర్ల కొరత తీర్చటం, 41 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం, వారికి ప్రమోషన్లు ఇవ్వటం, మెరుగైన పీఆర్సీ ఇవ్వటంవల్ల ఎంతో ఉత్సాహంగా పనిచేసిన టీచర్లు టెన్త్ పరీక్షల్లో ప్రతి సారీ 90 శాతం పైనే ఫలితాలు సాధించడానికి కృషి చేసారు.
బెండపూడిలో పదేళ్లుగా ప్రసాద్ అనే టీచర్ ఎన్నారైల సహకారంతో విద్యార్థులను అమెరికన్ యాసెంట్ లో మాట్లాడేలా తీర్చిదిద్దితే, ఆ ఘనత తన ఖాతాలో వేసుకున్నారు జగన్ రెడ్డి. ఇప్పుడు 2 లక్షల మంది ఫెయిల్ అయితే అది మాత్రం జగన్ రెడ్డి ఖాతాలో ఎందుకు వేసుకోవడం లేదు. ప్రభుత్వం చేతకానితనం, మూర్ఖత్వం, విద్యార్థుల సంక్షేమ పథకాలు తగ్గించాలనే కుట్రకి లక్షలాది మంది విద్యార్థులు బలి అయ్యారు. చెత్త ప్రభుత్వం, చేతగాని సీఎం వలన టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. ఎవ్వరూ అధైర్య పడొద్దు. పరీక్షల నిర్వహణ, రిజల్ట్స్ ప్రకటన లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా టిడిపి పోరాడుతుంది. అందుకే రీ వెరిఫికేషన్, సప్లిమెంట్రీ ఎగ్జామ్స్ కు ఫీజు రద్దు చేయాలి, పరీక్ష పత్రాలు పాత ఫార్మాట్ కు మార్చాలి, ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి, మంత్రి సమీక్ష చేసి శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలోని తల్లిదండ్రులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్ ఎంత ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి ఏడుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. వీరి కుటుంబాలను ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. కొడుకులు, కూతుళ్లకు మంచి భవిష్యత్ ను ఇచ్చేందుకు ప్రతి తల్లిదండ్రులు తాపత్రయ పడతారు. కాని ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఉంటే విద్యార్ధులు, తల్లిదండ్రలు కన్న కలలు చెరిపేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా పరీక్షా పత్రాన్ని చేంజ్ చేస్తే విద్యార్ధులు ఎలా పరీక్షలు రాస్తారో అన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది. ఆ విషయాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.
వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, వాలెంటీర్లను ప్రభుత్వం తీసుకువచ్చింది ప్రభుత్వం ఉపాధ్యాయులతో చేయిస్తున్న పనులను వాళ్లతో ఎందుకు చేయించుకోవడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రి సమాధానం చెప్పటం లేదు గాని సాక్షి జీతగాడైన సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పడం ఏంటి? ఎవరూ ఈ సజ్జల? కోవిడ్ వలన విద్యార్ధులు ఇబ్బందికి గురి అవుతారని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు గత ఏడాది పరీక్షలు రద్దు చేశారు. దాని తరువాత ఇతర రాష్ట్రాల్లో పాస్ పర్సంటేజ్ వచ్చింది. కాని ఇక్కడ ఎందుకు రాలేదు. విద్యార్ధులకు పరీక్షా పత్రాలు చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రభుత్వం తప్పు చేయలేకపోతే ఏపీలోనే ఎందుకు పాస్ పర్సంటేజ్ పడిపోయింది.
రాద్ధాంతం చేసేందుకు వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు ఈ మీటింగ్ కు వస్తున్నారు. గడప గడప కార్యక్రమంలో ప్రజలు కొడుతున్నారు కాబట్టి ఇక్కడకు వచ్చి నాపై యుద్దం చేసేందుకు సిద్దపడుతున్నారు. పిల్లలను అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు పిల్ల చేష్టలు చేస్తున్నారు. విద్యార్ధులను అడ్డం పెట్టుకొని దద్దమ్మల్లా మీటింగ్ లోకి వస్తున్నారు. మా పార్టీ నుంచి కొన్న ఒకరు, సన్న బియ్యం ఇవ్వలేని వాళ్లు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విద్యార్ధులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. నేరుగా వచ్చినా ఏం చేయలేరు, ఇంకా జూమ్ కాల్ మీరు నన్నేం చేయగలుగుతారు. నవ్యతోట అని పేరు పెట్టుకొని ఒక ఎమ్మెల్యే, కార్తిక్ కృష్ణ అని పేరు పెట్టుకొని మాజీ మంత్రి జూమ్ మీటింగ్ లోకి వస్తున్నారు. ఆడవాళ్లు, విద్యార్ధుల పేర్లు పెట్టుకొని ఇలా మీటింగ్ లోకి రావడం సిగ్గుచేటు.
ప్రణవ్ గోపాల్, టీన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు – కరోనా సమయంలో ప్రభుత్వం మూర్ఖంగా పరీక్షలు నిర్వహించాలని ప్రయత్నించినప్పుడు నారా లోకేష్ గారు తల్లిదండ్రులతో చర్చలు జరిపి విద్యార్ధుల పక్షాన నిలిచి ఉద్యమించి పరీక్షలు రద్దు అయ్యేలా పోరాటం చేశారు. నేడు పదవ తరగతి విద్యార్ధులను
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు దగ్గర కమీషన్లు తీసుకోవడం తప్పా విద్యార్ధుల భవిష్యత్ ను పట్టించుకోలేకపోతోంది. టీచర్ల నియామకం చేపట్టలేదు. ఉపాధ్యాయులను అడ్డం పెట్టుకొని నాడు నేడు పేరుతో కమీషన్లు కొట్టేస్తున్నారు. ప్రభుత్వం చేతగాని తనానికి విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్ధుల పేర్లు మీద పిల్లుల్లా మీటింగ్ లో లాగిన్ అవుతున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు
పదవ తరగతిలో 4 మార్కులు తగ్గాయని నా బిడ్డ వెన్నెల ఆత్మహత్య చేసుకుంది. మేము సామానుల వ్యాపారం చేసుకునే వాళ్లం. మేము చాలా బీదవాళ్లం. నా కూతురు బాగా చదువుతుంది అయినా ఎందుకు ఫెయిల్ అయ్యిందో అర్ధం కావడం లేదు. వెన్నెల డాక్టర్ చదువుకోవాలని అనుకుంది.
– కె. హనుమంతరావు, ఆత్మహత్య చేసుకున్న వెన్నెల తండ్రి
మాకు ప్రభుత్వం అన్యాయం చేసింది. గతంలో పేపర్ 1, పేపర్ 2 ఉండేది కాని ఇప్పుడు ప్రభుత్వం అన్నింటిని మార్చేసింది.
శిరీష్, తండ్రి సుధాకర్
ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రభుత్వం భవిష్యత్ తరాలను నిర్మించాల్సిన తరుణంలో ఇటువంటి అస్థవ్యవస్థంగా పాలన చేస్తూ అంథకారంలోకి నెట్టేస్తున్నారు. సంస్కరణల్లో విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేయకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు చేస్తున్నారు. 11 పేపర్లను 7కు తగ్గించారు. సోషల్, మ్యాథమెటిక్స్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం రెండు పేపర్లు వేరు వేరుగా ఉండేవి. 15 బిట్లల్లో 12 వరకు విద్యార్ధులకు వచ్చే అవకాశం ఉండేది. అంతేకాకుండా చాయిస్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు పై ప్రశ్న లేక కింద ప్రశ్న అన్నట్లుగా పేపర్ ను మార్చేశారు. ఉపాధ్యాయులకు లెక్కకు మించిన యాప్ లు పెట్టారు. ఉపాధ్యాయుడు పాఠం చెప్పే దాని కంటే నాడు నేడు, అమ్మ ఒడి, యాప్ ల అప్ లోడ్ కే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది.
– ఎం అప్పారావు, నోబెల్ టీచర్స్ అసోషియేషన్ అధ్యక్షులు
పరీక్షలు ప్రారంభం అయిన తరువాత ఇంత దౌర్బాగ్య పరిస్థితి ఎన్నడూ చూడలేదు. మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజ్ అంటూ విద్యార్ధుల మనోధైర్యాన్ని దెబ్బతీయడంతో ఫెయిల్ అయ్యారు. 1979 తరవాత ఇప్పుడే అత్యధికంగా సోషల్ లో ఫెయిల్ అయ్యారు. ఉప్పెనలా రిజల్ట్ వచ్చి పడ్డాయి. రిజల్ట్ ఇస్తున్నామని అధికారులు చెప్పి రెండు రోజుల తరువాత విడుదల చేశారు. 1980లో అంజయ్య గారు 10 గ్రేస్ మార్కులు ఇచ్చారు. నేటి ప్రభుత్వం అలానే మార్కులు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు సరైన అవగాహనతో చేయడం వలన మంచి రిజల్ట్ ఉండేది. విద్యార్ధులకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 3 ఏళ్లుగా పడిపోయింది. నేడు ఉపాధ్యాయుడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్లు పాఠశాలల మీద దాడి చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే ఉపాధ్యాయులను రోడ్ల మీద నిలబెట్టారు. నర్సరావు పేటలో పాఠశాలలకు తాళం వేశారు. ఉపాధ్యాయులపై నాయకుల జులుం ఎక్కువైంది. కోవిడ్ సమయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంలో వైఫల్యం చెందింది. ఈ ఏడాది ఫలితాలు గ్రామీణ ప్రాంతాల్లో దారుణంగా పడిపోయింది.
– అబ్బిరెడ్డి, పదవ తరగతి విద్యార్ధుల తల్లిదండ్రులు
గత ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించింది కాబట్టే పాస్ పర్సంటేజ్ ఎక్కువగా వచ్చిందని, ఈ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తుంది కాబట్టే పర్సంటేజ్ తక్కువగా వచ్చిందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
– హర్షిణి, దాచేపల్లి
నాకు 580 వస్తాయని అంచానా వేస్తే 512 మాత్రమే వచ్చాయి. సడన్ గా మార్క్స్ తగ్గిపోయాయి. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వైపల్యం చెందుతుంది. రీ వాల్యుయేషన్ చేయించాలనుకున్నా మళ్లీ తగ్గుతాయేమోన్న భయం వేస్తుంది.
– రమ్యశ్రీ, తాడేపల్లి, పిన్ని
పరీక్షలు పెడతానన్నప్పుడు మొదట మీరు వద్దాన్నారు అదే పెద్ద ఫెయ్యూలర్ గా కనపడుతోంది. పిల్లలు ఆన్ లైన్ పరీక్షలు రాసి నేను ప్రతి సబ్జెక్ట్ లో మంచి మార్కులతో పాస్ అయ్యాను. కాని సైన్స్ లో ఒక్క మార్క్ తో ఫెయిల్ అయ్యాను.
– మాయల సోని, విద్యార్ధిని, రాయపూడి