175 సీట్లు గెలుస్తాననే నమ్మకంవుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలి

– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

175 సీట్లు గెలుస్తాననే నమ్మకంవుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు మీకోసం… 2 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకొని దాదాపు పది మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న దుర్మార్గులు వైసీపీ నాయకులు . దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 10వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో జూమ్ కాల్స్ నిర్వహిస్తుంటే వైసీపీ నాయకులు ఆటంకపరిచారు. వైసీపీ పార్టీ ఫేక్ పార్టీ. టెన్త్ కాస్ల్ పాస్ కాని సన్నాసి కొడాలి నానికి.. టెన్త్ క్లాస్ విద్యార్థుల జూమ్ మీటింగ్ లో ఏం పని? కార్యక్రమాన్ని ఎగతాళి చేశారు. ఫేక్ ఐడీలతో ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటారు. విద్యార్థులకు ధైర్యాన్ని ఇవ్వాలని లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఈ రకంగా భంగం కలిగించడం ఎంతవరకు సమంజసం? దీనిపై సంబంధిత అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలి.

ఈ మూడు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ప్రజలను దగా చేశారు. ఒక్క సారి అధికారం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చారు. అన్ని రంగాలను నాశనం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం, ఒంగోలులో జరిగిన మహానాడును చూసి జగన్ కల్లుతాగిన కోతిలా మారి పిచ్చి ప్రేలాపనలు పేలుస్తున్నారు. వైసీపీ పార్టీ నిర్వహించిన వర్క్ షాప్ లో జగన్ అనేక పిచ్చి ప్రేలాపనలు పేలారు. ప్రజలకు అదిచేస్తాం, ఇది చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఈ మూడు సంవత్సరాల్లో అన్ని రంగాలను నాశనం చేశారు. అనేక విధ్వంసాలు సృష్టించారు. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. వైసీపీ నాయకులు కల్లుతాగిన కోతుల్లా మారి పిచ్చి ప్రేలాపనలు పేలుస్తున్నారు.

మళ్లీ ఎన్నికలు జరిగితే 175 స్థానాలు గెలుస్తానని చెప్పడం విడ్డూరంగా వుంది. 175 సీట్లు గెలుస్తాననే నమ్మకంవుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలి. 30 ఏళ్లు మాదే పాలన అని డాంభికాలు పలికిన జగన్, ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఓటమి భయం పట్టుకుంది. వ్యవస్థల్ని వాడుకొని, పోలీసులను నీ ఆధీనంలోకి తెచ్చుకొని ఇతర పార్టీలపై దాడులు చేసి గెలవాడినికి నీ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు, మండల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కాదు. ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలకు ఏం ఉపకారం చేశారో చెప్పాలి. జగన్ రాజకీయాలకు అనర్హుడు. ఒకసారి ప్రజలు వైసీపీకి ఓట్లు వేసి నష్టానికి గురయ్యారు. ఏ రంగంలో ఏం సాధించారో చెప్పాలి. వ్యవసాయ రంగానికి తాళాలు వేసి రైతులకు ఉరి తాళ్లు వేశారు. 2,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ధాన్యం అమ్మితే ధాన్యం తీసుకొన్న ప్రభుత్వం రైతులకు బకాయిలు ఉంచుతున్నారు. క్రాప్ హాలిడే ప్రకటించారు.

టీడీపీ హయాంలో పోలవరాన్ని 75 శాతం పూర్తి చేస్తే.. ధనదాహంతో వైసీపీ నాయకులు సర్వ నాశనం చేశారు. అన్ని ప్రాజెక్టులు టీడీపీ పాలనలో 80 శాతం పూర్తి చేస్తే వైసీపీ పాలనలో 2 శాతం కూడా కాలేదు. అన్నమయ్య ప్రాజెక్టును కాపాడలేకపోయారు. తద్వారా 62 మంది రైతుల ప్రాణాలు బలిగొన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా 32 వేల ఎకరాల భూమి ప్రభుత్వానికి ఇస్తే టీడీపీకి పేరు వస్తుందని అధికారంలోకి రాగానే అమరావతిని నాశనం చేసి.. అమరావతిని స్మశానంతో పోల్చారు. రైతులను నిండా ముంచినందుకు నీకు ఓట్లేయాలా? చంద్రబాబునాయుడు హయాంలో ఎన్నో పరిశ్రమలొచ్చాయి. కియా, హీరో ఇలా కొన్ని వందల పరిశ్రమలొచ్చాయి. లక్షలాదిమందికి ఉపాధి లభించింది. ఈ విషయాన్ని మీ మంత్రే శాసనసభలో ధృవీకరించారు. ఉన్న పరిశ్రమలు జగన్ ధనదాహానికి, దౌర్జన్యానికి భయపడి రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. నిరుద్యోగతను పెంచి, యువత రోడ్డున పడినందుకు ఓట్లేయాలా?

2014లో అస్తవ్యస్థంగా వున్న విద్యుత్ వ్యవస్థను రెండు నెలల్లోనే చంద్రబాబు గాడిలో పేడితే.. నేడు చేతకానితనంతో చిన్నాభిన్నం చేశారు. సీపీఎస్ రద్దు, జీతాల పెంపు అని చెప్పి అధికారంలోకి వచ్చి ఉద్యోగస్థులను మోసం చేశారు. 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, వారిపై భారం మోపి వారి జీవితాలతో ఆడుకున్నందుకు ప్రజలు నీకు ఓట్లేయాలా? పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యవసర ధరలు ఆకాశాన్నంటించినందుకు ఓట్లేయాలా? ఎన్నికలకు ముందు … మద్యపాన నిషేధం పెడతా అని చెప్పి దేశంలోనే దొరకని జే బ్రాండ్ల మద్య్యాన్ని రాష్ట్రంలో పెట్టి రూ.25 వేల కోట్లు దిగమింగినందుకు ప్రజలు ఓట్లేయాలా? మద్యంపై వచ్చిన ఆదాయన్ని తాకట్టు పెట్టి 25 వేల కోట్లు అప్పు తెచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడా లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చంద్రబాబునాయుడు దిగిపోయేంతవరకు 3 లక్షల కోట్లు అప్పుంటే 3 సంవత్సరాల్లో 8.5 లక్షల కోట్లు అప్పు చేసినందుకు ఓట్లేయాలా?, చెత్తపై పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రికి ప్రజలు ఓట్లేలా వేస్తారు? ఒక్కొక్క కుటుంబంపై లక్షా పదివేలు అదనపు భారాన్ని మోపారు. 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు.

ఒక్క పరిశ్రమను తెచ్చి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశం కల్పంచిన దాఖలాలు లేనందుకు ఓట్లేయాలా? ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చారు.కొన్ని వేల కోట్లు ప్రజలనుండి ట్యాక్సులు వసూలు చేశారు ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఎక్కడా ఒక్క రోడ్డు వేయలేదు, ఒక బ్రిడ్జీ కట్టలేదు. చంద్రబాబు పెట్టిన 34 సంక్షేమ పథకాలు ఎత్తేశారు. అన్నా క్యాంటిన్లు, చంద్రన్నబీమా, పెళ్లికానుక, విదేశీ విద్య, విద్యోన్నతి పథకం లాంటివి ఎత్తేసినందుకు ఓట్లేయాలా? , అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు, జీతాలు పెంచుతామన్నారు. టీఏ, డీఏలు ఇస్తామన్నారు. 1వ తేది వస్తే జీతాలు అందని పరిస్థితులున్నాయి. సీపీఎస్ అంటే దానిపై కమిటీ వేసి నానా రభస చేశారు. ఉద్యోగులు ఎలా ఓట్లే్స్తారు? ప్రధానమైన ల్యాండ్, శాండ్, వైన్, మైన్ వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నందుకు ఓట్లేయాలా? ఎన్నికలకు ముందు సింపతీ కోసం కోడికత్తితో పొడిపించుకొని డ్రామా ఆడారు. బాబాయిని హత్య చేయించి సింపతీ పొంది ఓట్లేయించుకున్నారు. తప్పుగా మాట్లాడివుంటే 5 కోట్ల ఆంధ్రులు నన్ను ప్రశ్నించొచ్చు. అన్ని వర్గాల ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి మళ్లీ డాంభికాలు పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్లిన ప్రజలు ఛీకొడుతున్నారు.

రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబునాయుడు నాయకత్వం అవసరమని ప్రజలంటున్నారు. గడప గడపకి వైపీపీలో సీఎంని, మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. బస్సు యాత్ర కాస్త తుస్సుయాత్ర అయింది. నాయకులకు గడప గడపకు వెళ్లమంటే వెళ్లమని చెబితే దానికి 175 సీట్లు వస్తాయని డాంభికాలు పలుకుతున్నారు. రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలి గానీ చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోతుంది, రామోజీరావు ముసలివారయ్యారు, ఏబీఎన్ రాధాకృష్ణ పని అయిపోతుందని వారి నాశనాన్ని కోరుకోవడం మంచిది కాదు. జగన్ ఊకదంపుడు ఉపన్యాసాలను నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ చేస్తున్నాను. పిచ్చి ప్రేలాపనలు మానాలి. రాష్ట్రంలో వైసీపీకి పూర్తి వ్యతిరేకత వచ్చింది. వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపకపోతే ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.

Leave a Reply