Suryaa.co.in

Andhra Pradesh

భజనతో కాదు.. బాధ్యతతో ఐక్య వేదిక పనిచేస్తుంది

ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక కౌన్సిల్ సమావేశం స్థానిక బందర్ రోడ్ లోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో చైర్మన్ కె.ఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక” ఏర్పాటు చేసిన అంశాన్ని తెలియచేస్తూ పరిష్కారమే లక్ష్యంగా “భజనతో కాదు 1. బాధ్యతతో, పార్టీలతో కాదు- ప్రభుత్వంతో” అనే వివాదంతో పనిచేస్తున్న మన ఐక్యవేదికను మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు కృషిచేయాల్సిన అవసరాన్ని ఐక్యవేదిక రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి హాజరై మన హక్కుల కోసం పనిచేసే ఒక మంచి వేదిక గా ఈ సమావేశాన్ని నిర్వహిస్తు మన్నారు .

మా ఐక్యవేదిక ప్రధాన డిమాండ్లు
సి.పి.ఎస్. / జి.పి.ఎస్. రద్దు – ఓ.పి.ఎస్. పునరుద్ధరణ. 12వ పి.ఆర్.సి. సత్వర అమలు – సకాలంలో డి.ఎ.ల చెల్లింపు. 25 వేల కోట్లకు పైగా ఉన్న పెండింగ్ పి.ఆర్.సి., డి.ఎ., ఎస్.ఎల్.ఎస్, ఎ.పి.జి.ఎల్.ఐ బకాయిల చెల్లింపు. 1వ తేదీనే జీతాలు / పెన్షన్ల చెల్లింపు చట్టబద్ధం చేయడం. ఎన్.ఎమ్.ఆర్. కంటింజెంట్ / కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్. పెన్షనర్లకు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలు. మెరుగైన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇళ్ళస్థలాల కేటాయింపు.

టీచర్స్ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ సమస్యకి శాశ్వత పరిష్కారం – మెరుగైన విద్యావ్యవస్థ ఏర్పాటుకు చట్టబద్ధ చర్యలు. గ్రామ / వార్డు సచివాలయం ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, సర్వీసు రూల్స్ అమలు తదితర సంస్థాగత సమస్యలకు పరిష్కారం. ఎ.పి.ఎస్. ఆర్.టి.సి. ఉద్యోగుల విలీన సమస్యల పరిష్కారం. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు. ఈ డిమాండ్లు సాధనకై ఈ ఐక్యవేదిక కి ప్రతి ఒక్కరు పని చేస్తారని ఐక్యతతోనే సాధించుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ కోచ్ చైర్మన్ కె హరికృష్ణ స్టీరింగ్ కమిటీ సభ్యులు పలువురు సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE