Suryaa.co.in

Telangana

నేరాల నియంత్ర‌ణ‌లో సాంకేతిక అస్త్రం

-నేర ఛేద‌న కంటే.. నేర నివార‌ణ ఉత్త‌మం: సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర
-నేరాల నియంత్ర‌ణ‌, పోలీసు దర్యాప్తు తీరుతెన్నుల‌పై స‌మీక్షా సమావేశం

నేరాల‌ను నియంత్రించేందుకు , ప‌రిశోధ‌న‌లోనూ సాంకేతిక ప‌రిజ్ఙానం ఆయుధంగా పోలీసులు ఉప‌యోగించుకోవాల‌ని సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర‌ స్ప‌ష్టం చేశారు. నేరాలు జ‌రిగాక స్పంద‌న కంటే నివార‌ణ‌కు అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం ఉత్త‌మ‌మ‌ని పేర్కొన్నారు. బుధ‌వారం సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్‌ల అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, . క్రైమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అధికంగా నేరాలు నమోదు అవుతన్న పోలీస్ స్టేషన్లలో రానున్న రోజుల్లో నేరాలను తగ్గించేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని తగిన ప్రణాళిక సిద్ధం చేసి క్రైమ్ రేట్ తగ్గించాలని ఆదేశించారు. నేర ప‌రిశోధ‌న‌, నియంత్ర‌ణ‌లో కీల‌కమైన సీసీఎస్ , ఏసీపీ, డీఐ, డీఎస్సై,
Whats-App-Image-2022-05-11-at-3-54-36-PM ఇన్వెస్టిగేష‌న్ అధికారుల స్పంద‌న నేర నిర్ద‌ర‌ణ‌లో అనుస‌రించాల్సిన మార్గాల‌పై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్‌లు, ప‌గ‌లు, రాత్రి జ‌రిగే దొంగ‌త‌నాలు, ఆటోమొబైల్ చోరీలు ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. నేరాలను అరికట్టేందుకు మరియు నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలన్నారు. నేరం జ‌ర‌గ‌గానే అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యం చేసుకోవ‌టం ద్వారా నేర‌స్తుల‌ను తేలిక‌గా ప‌ట్టుకోవ‌చ్చ‌ని సూచించారు. నేర ప‌రిశోధ‌న‌, ద‌ర్యాప్తులో ప్రతి ఒక్క‌రూ చురుగ్గా ఉండాల‌న్నారు.

నేర‌స్తుల‌ను ప‌ట్టుకోవ‌ట‌మే కాదు.. స‌రైన ఆధారాల‌తో నేర‌స్తుల‌కు శిక్ష‌లు ప‌డేలా స‌రైన స‌మ‌యంలో ఛార్జిషీటు దాఖ‌లు చేయాల‌న్నారు. యూఐ కేసులు, పెండింగ్‌, మ‌హిళ‌ల‌పై నేరాల‌, మాద‌క‌ద్ర‌వ్యాల ర‌వాణా త‌దిత‌ర అంశాల‌పై పోలీస్ స్టేష‌న్ వారీగా ఆరా తీశారు. కేసుల ద‌ర్యాప్తు, రిక‌వ‌రీ త‌క్కువ‌గా ఉన్న పోలీస్‌స్టేష‌న్ల వెనుక‌బాటుకు కార‌ణాలు విశ్లేషించారు. లోపాల‌ను స‌రిదిద్దుకొని వేగ‌వంతంగా కేసుల ద‌ర్యాప్తు పూర్తిచేయ‌టం, సొమ్ము రిక‌వ‌రీ చేప‌ట్ట‌డంపై అనుస‌రించాల్సిన ప‌ద్ద‌తుల‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు. రాష్ట్ర స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అన్ని స్థాయిలలో అందుబాటులో ఉన్న వనరులను సమీకరించడం ద్వారా పెండింగ్‌ను గడువులోగా ముగించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. దర్యాప్తు ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రతి పీఎస్‌ పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తామని సీపీ తెలిపారు. క్రైమ్ డిటెన్ష‌న్‌, క్రైమ్ పెట్రోలింగ్ అంశాల‌పై ప్ర‌త్యేకంగా స‌మీక్ష జ‌రిపారు. నేర‌ద‌ర్యాప్తు, సొమ్ము రిక‌వ‌రీలో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన అధికారుల‌కు రివార్డులు అంద‌జేశారు.ఈ సమావేశానికి క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, డీసీపీ ఇందిర, ఏడీసీపీ నరసింహ రెడ్డి, ఏసీపీ లు, ఇన్‌స్పెక్టర్లు, డీఐ లు, ఎస్ఐ లు మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

LEAVE A RESPONSE