Suryaa.co.in

Telangana

డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయండి

క్యాట్ ను ఆశ్రయించిన ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, సృజన

హైదరాబాద్ : తనను తెలంగాణలోనే కొనసాగించాలని, డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ ఆమ్రపాలి క్యాట్ ను ఆశ్రయించారు. ఆమ్రపాలితో పాటు మరో ముగ్గురు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. తెలంగాణలో పని చేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ఏపీలో పని చేస్తున్న సృజన క్యాట్‌ను ఆశ్రయించారు.

తమను తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్.. ఏపీలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సృజన వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వారి పిటిషన్లపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ మంగళవారం విచారణ చేపట్టనుంది.

LEAVE A RESPONSE