-తిరుగుబాటు అంటే ఎందో మోడీకి కన్నడ ప్రజలు రుచి చూపించారు
-కర్ణాటక ఫలితాలు అందుకు సంకేతం
-తొమ్మిది రాష్ట్రాలలో అనైతికకంగా ప్రభుత్వాల ఏర్పాటు
-ప్రజల తీర్పును ఖాతరు చెయ్యకుండా అధికారంలోకి
-అందుకే కన్నడ నాట కర్రు కాల్చి వాత పెట్టారు
-వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకీ గుణపాఠం తప్పదు
-కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు స్థితిలో ఉంది
-ప్రజలు అధికారం అప్పగించినా నిలబెట్టుకోలేని దుస్థితి కాంగ్రెస్ ది
-మంత్రి జగదీష్ రెడ్ది
ప్రధాని మోడీ పాలన పై తిరుగుబాటు మొదలైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కన్నడ నాట ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనంగా మారిందన్నారు.అసలు తిరుగుబాటు ఎట్లా ఉంటుందో అన్న రుచిని కర్ణాటక ప్రజలు ఈ ఎన్నికల్లో మోడీకి చూపించారని ఆయన ఎద్దేవాచేశారు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మంత్రి జగదీష్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తో కలసి మీడియా తో మాట్లాడారు.తొమ్మిది రాష్ట్రలలో అనైతికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర మోడీ దని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల తీర్పును ఖాతరు చెయ్యకుండా అప్రజాస్వామిక పద్దతిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన దుర్మార్గం బిజేపి దని ఆయన మండిపడ్డారు.
అందుకే కన్నడ నాట ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని ఆయన విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి కి గుణపాఠం చెప్పేందుకు యావత్ భారతావని సన్నద్ధం అవుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.విపక్ష కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు స్థితికి చేరుకుందన్నారు.ప్రజలు అధికారాన్ని అప్పగించినా నిలబెట్టుకోలేని దుస్థితికీ కాంగ్రెస్ పార్టీ చేరుకుందన్నారు.