Suryaa.co.in

Telangana

ప్రజారోగ్యంలో విప్లవాత్మకమైన మార్పులు

రప్,అమెరికాలను మైమరిపిస్తున్న వైనం
ప్రజారోగ్యమే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యం
మెడికల్ కళాశాలల ఏర్పాటు సంచాలనాత్మకమే
పేదోడి చెంతకు కార్పొరేట్ వైద్యం
కొత్తపుంతలు తొక్కుతున్న వైద్యరంగం
కేసీఆర్ కిట్,కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లు
కంటి చూపునిస్తున్న కంటి వెలుగు
ఆరోగ్య మహిళ పధకంలో 57 రకాల పరీక్షలు
ప్రసూతీ లకై సర్కార్ దవాఖానలకు పరుగులు
సహజ ప్రసవాలకు ప్రాముఖ్యత నిస్తున్న వైద్యులు
తగ్గిన మాతా, శిశు మరణాలు
ప్రభుత్వఆసుపత్రులలో ఔట్ పేషంట్ల రద్దీ
డయాగ్నిస్టిక్ హబ్ గా తెలంగాణా
కోవిడ్ సమయంలో వైద్య రంగం సేవలు వేలకట్టలేనివి
కెసిఆర్ కిట్ అమలులో ఆశా వర్కర్ల పాత్ర అమోఘం
మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యపేటలో ఘనంగా రాష్ట్రవతరుణ దినోత్సవ దశాబ్ది వేడుకలు
మెడికల్ కళాశాల ప్రాంగణంలో వైద్య ఆరోగ్య దినోత్సవం సంబురాలు
ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు.

ప్రజారోగ్యంలో విప్లవాత్మక మైన మార్పులు సంభవించాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. యూరప్,అమెరికా వంటి అగ్ర రాజ్యాలను మరిపించే స్థాయికి తెలంగాణా వైద్య రంగం చేరుకుందని ఆయన వెల్లడించారు. ప్రజారోగ్యమే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యం అని ఆయన చెప్పారు.జిల్లాల పునర్విభజనతో ఏర్పడ్డ ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అందుకు నిదర్శనమన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో బాగంగా బుధవారం సూర్యపేట మెడికల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఆరోగ్యశాఖా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డి యం హెచ్ ఓ కోటా చలం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడూతూ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం చేరిందన్నారు.
తెలంగాణా వస్తే ఏమొచ్చింది అని ఆడిగేటోడికి ఇదే సరైన సమదనమన్నారు.

మెడికల్ కళాశాలల ఏర్పాటు వైద్య రంగంలో సంచలనం సృష్టించాయన్నారు.అటువంటి మెడికల్ కళాశాలల ఏర్పాటుతో ఒక్క సూర్యపేటలోనే 2014 కు పూర్వం 100 పధకలు ఉండగా అవి ఇప్పుడు 450 కు పెరిగాయన్నారు.అప్పుడు ఐ సి యు అంటేనే అర్థం తెలియని ప్రజలకు ఇప్పుడు ఏకంగా 50 పడకలు ఏర్పాటు అయ్యాయని ఆయన వివరించారు.

2014 కు పూర్వం కేవలం 95 జెనరల్ బెడ్స్ ఉండగా అవి ఇప్పుడు 350 కి చేరదం వైద్యరంగంలో మార్పుకు సూచి అని ఆయన చెప్పారు. అత్యవసర విభాగం అనేది 2014 కు పూర్వం లేనే లేదని ఇప్పుడు ఒక్క సూర్యపేట ఆసుపత్రిలో 10 బెడ్స్ ఏర్పాటు చెయ్యగా అప్పట్లో లేని ఎస్ ఎన్ సి యు బెడ్స్ 20,యం సి హెచ్ బెడ్స్ 50 తో పాటు రెండు అంటే రెండే ఉన్న ఆపరేషన్ ధియేటర్లను 9 కి పెంచడం అంటే అత్యవసర చికిత్సల కోసం వైద్య రంగంలో వచ్చిన మార్పు కాదా అని ఆయన పేర్కొన్నారు.

అదే విదంగా ఔట్ పేషంట్ల సంఖ్యను అప్పటికి ఇప్పటికి మారిన గణాంక వివరాలను ఆయన వెల్లడించారు.2014 కు పూర్వం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి నెలకు 3,150 మంది పేషేంట్లు మాత్రమే నమోదు కాగా ఇప్పుడు ఆ సంఖ్య నెలకు 27,720 గా నమోదు అవుతుందిఅంటే సర్కార్ ఆసుపత్రిలపై ప్రజలకు పెరిగిన విశ్వసనీయతకు అద్దం పడుతుందన్నారు.అప్పట్లో నెలకు 50 మాత్రమే ఆపరేషన్లు జరుగుతుండగా ఇప్పుడు ఏకంగా 450 కి పెరగడం అంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వైద్య రంగం సామాన్యుడికి చెంతకు ఏ రకంగా చేరిందన్నది ఊహించు కోవచ్చు అన్నారు.

ఇక అప్పట్లో విధి లేక ప్రవేయిట్ ఆసుపత్రికి పోలేక సర్కార్ దవాఖానలకు ప్రసూతి కోసం వస్తుండగా ప్రస్తుతం గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ అసుపత్రుల ముందు బారులు కడుతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రము ఏర్పడ్డాకా తొమ్ముడి అంటే తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో వైద్య రంగం కొత్త పుంతలు తొక్కతుంది అనడానికి దేశంలో ఎక్కడా లేని విదంగా కేసీఆర్ కిట్,కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య మహిళా పధకంలో 57 రకాల పరీక్షలు, కేసీఆర్ బి పి &షుగర్ కిట్లు,పల్లె దవాఖాన,బస్తి దవాఖానలు,వయో వృద్ధుల ఆశ్రమాలు దర్పణం పడుతుండగా భోదకాలు సోకిన వారికి ఫించన్ పధకం ప్రవేశ పెట్టడం నిలువెత్తు నిదర్శనాలు అన్నారు.

అందుకే తెలంగాణా అమలు పరుస్తుంది దేశం ఆచరిస్తుంది అనడానికి తొమ్మిది ఏళ్లలో వైద్య రంగంలో సంభవించిన మార్పులే తార్కాణమన్నారు.అందుకు తెలంగాణా డయాగ్నిస్టి హబ్ ను సూర్యాపేట లో ప్రారంభించుకోవడం ముదాహమన్నారు.వైద్యకళాశాల ఏర్పాటు తో వైద్య రంగంలో మార్పులే కాదు గణనీయంగా వైద్యులు సిబ్బంది పెరిగిన విషయాన్ని విస్మరించ రదన్నారు.60 ఏళ్లలో మూడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే 9 ఏళ్లలో 21 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన రికార్డ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సొంతం అని ఆయన కొనియాడారు.తద్వారా ఉపాధి ఉద్యగవకాశాలు పెరిగాయాన్నారు.

ఏక కాలంలో 1061 మందిని అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్ మెంట్ జరగడం వైద్య చరిత్రలోనే సరికొత్త రికార్డ్ గా ఆయన అభివర్ణించారు. అవే మార్పులతో బస్తి నుండి పట్నం దాకా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు ఇతరత్రా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో మాతా, శిశు మరణాలుగణనీయంగా పడిపోవడం పెద్ద మార్పుగా ఆయన చెప్పారు.కోవిడ్ సమయంలో వైద్యరంగం అందించిన సేవలు అందులో సూర్యాపేట సిబ్బంది అందించిన సహకారాన్ని ఆయన ప్రశంసించారు.

కేసీఆర్ కిట్ అమలులో ఆశా వర్కర్ల పాత్ర ఆమోఘంగా ఆయన చెప్పారు. యింకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ వైస్ చైర్మన్ కిశోర్, జడ్ పి వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్,జడ్ పి టి సి లు బిక్షం,అనిత యం పి పి రవీందర్ రెడ్డి,
డిప్యూటీ డి యం హెచ్ ఓ హర్షవర్ధన్,మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారద, సూపరెండేంట్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE