ఆది 1890…
బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో అనంతపురం జిల్లా యాడికి వేరుశనగ బాగా పండేది. ఆ ఊరిలో మోతుబరి రైతు అయిన శెనక్కాయల రత్నయ్య వేరుశనగ పండించడంలో నిపుణుడు. దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉండేవి.
అదే సమయంలో పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతంలో వేరుశనగ పంట పండించడానికి , బ్రిటిష్ వారు మన శెనక్కాయల రత్నయ్య కాళ్ళా వెళ్ళా పడి బ్రతిమలాడి ప్రస్తుత పాకిస్తాన్ లోని గుజ్రాన్వాల ప్రాంతానికి పంపారు. ఆయన అక్కడ పరిస్థితులను చక్కబెట్టి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాడు.
శనక్కాయల రత్నయ్య పేరు సరిగ్గా పలకడం రాక రత్నయ్య శునాక్ అని సంబోధించడం మొదలుపెట్టారు. ఆయన కుమారుడే మన రిషి వాళ్ళ తాత రామదాసు శునక్. మిగతా కథ మీరు వార్తల్లో చదివే ఉంటారు.
కాబట్టి మిత్రులారా మన రిషి శునక్ మన అచ్చ తెలుగువాడు, అనంతపురం వాడు, యాడికి కి చెందిన వాడు. పాకిస్తాన్ కి పోకముందు అయన మన అనంతపురం లో ఉండేవాడు. రిషి ఈ విషయం తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని మురిసిపోయేవాడు.ఇది తెలుగు వారు, మరీ ముఖ్యంగా అనంతపురం వారు గర్వపడాల్సిన విషయం.
– ఖైజర్