Suryaa.co.in

Andhra Pradesh Uncategorized

రోడ్ల అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలి

– జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షత జరిగిన స్ధాయిసంఘ సమావేశంలో ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్

ఏలూరు: జిల్లాలో రూ. 97 కోట్లతో చేపట్టిన ఆర్ అండ్ బి రహదారులు అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సంబందిత అధికారులను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం స్ధానిక జిల్లాప్రజా పరిషత్ లో చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్య్క్షతన జరిగిన స్ధాయి సంఘ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎంపి పుట్టామహేష్ కుమార్ మాట్లాడుతూ గుంతలు రహిత ఏలూరు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కోరారు. జిల్లాలో కీలకమైన ఏలూరు, జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారులతోపాటు మరికొన్ని రహదారుల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. జిల్లాలో కైకలూరు, ఉంగుటూరు, పోలవరం, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల పరిధిలో 13 రహదారుల మరమ్మత్తులు చేపట్టినట్లు చెప్పారు.

కొద్దిపాటి వర్షాలకే బురదబారినపడి ప్రయాణికులు గత 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. వాటిని అధికమించేందుకు కూటమి ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులకు జిల్లాకు రూ. 97 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టిందన్నారు. ఆపనులు పూర్తి నాణ్యతతో నిర్ధేశించిన సమయంలోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సంక్రాంతి నాటికి గుంతలు రహిత ఏలూరు జిల్లాగా రూపుదిద్దుకోవాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతిఒక్కరికి అందించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు.

LEAVE A RESPONSE