– లేదంటే చరిత్రలో సూర్పణక కు పట్టిన గతే రోజాకు పడుతుంది.
– తప్పు చేయలేదని భావిస్తే మీ నాయకులు భువనేశ్వరి ని ఎందుకు క్షమాపణలు అడుగుతున్నారు?
-టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
అధికారం కోసం తల్లిని, చెల్లిని వీధిన తిప్పి.. అధికారంలోకి వచ్చాక రోడ్డున పడేశారు జగన్ రెడ్డి. నగరిలో వైసీపీ కార్యకర్తలు రోజాను తరిమి తరిమి కొడుతున్న జబర్ధస్త్ రోజాకు సిగ్గు రావడం లేదు. వైసీపీ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని రోజా ప్రస్ట్రేషన్ తో నారా భువనేశ్వరీ పై అవాకులు చవాకులు పేలుతోంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుక తెగ్గోస్తా. సూర్పనక కు పట్టిన గతే నీకు పడుతోంది.
వరద భాదితులను ప్రభుత్వం ఆదుకోకపోతే నారా భువనేశ్వరీ వారిని ఆదుకున్నారు. తినటానికి తిండి కూడ లేని పేదలకు ఆహారం, అనారోగ్యం పాలైనవారికి వైద్యం, ఆర్ధికంగా దెబ్బతిన్న వారికి రూ. 49 లక్షలు సహాయం చేసిన తల్లిపై విమర్శలు చేయడానికి రోజాకు నోరెలా వచ్చింది. రోజా కబడ్దార్. బడుగు,
బలహీన వర్గాల వారిని వేళన చేసిన నువ్వు అదే వర్గాలను అక్కున చేర్చుకుని ఆర్ధిక సహాయం చేసిన భువనేశ్వరీ పై మాట్లాడుతావా? ఆమె గురించి మాట్లాడే అర్హత నీకుందా? కరోనా టైంలో కుళాయి త్రిప్పడానికి ఏ స్త్రీల చేతనైతే కాళ్లపై పూలు చల్లించుకున్నావో వాళ్లను ఆదుకున్న వ్యక్తి భువనేశ్వరీ . ఆమెపై విమర్శలు చేస్తావా?
అమరావతి మహిళా రైతులుపై పోలీసులు లాఠీ ఛార్జీ చేసి ఇష్టమెచ్చినట్లు దాడి చేసిన రోజు నీ నోరేమైంది. మహిళా అధికారులను మీ వైసీపీ నేతలు వేధింపులకు గురిచేసినప్పుడు ఏమైంది నీ నోరు. వనజాక్షి గారు తప్పంతా నాదే అని పదేపదే ఎన్నిసార్లు చెప్పినా నీ చిన్న మెదడుకి అర్ధం కాదా? అదే విషయాన్ని ఎందుకు తీసుకొస్తున్నావ్. ఎన్నాళ్లు ఆ పేరును వాడుకుంటావు? భువనేశ్వరీ పై మీ నేతలు మాట్లాడింది నిజం కానప్పుడు వారు ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు?
వైసీపీ 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అందరం భువనేశ్వరీ కాళ్లు కడుగుతాం అని మీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి ఎందుకు అంటున్నారు. క్షమాపణలు చెబుతామంటున్న వాళ్లంతా గుడ్డివాళ్లా? నువ్వొక్కదానివే సరైనదానివా? అసెంబ్లీలో జగన్ రెడ్డిని పొగడటం తప్పా ప్రజాసమస్యలపై ఏనాడైనా మాట్లాడావా? నగరిలో వనమాల ప్లాట్ లో ఒక ఇండస్ట్రీ కోసం స్థలం కేటాయింపులో లంచం కోసం పెండింల్ పెట్టావు. మీ ఇద్దరి అన్నలతో పాటు దేవుడిచ్చిన జగన్ అన్నకు ఎంత వాటా ఇస్తున్నావు?
విజయపురం మండలంలో గ్రావెల్, ఇసుక లో నొక్కేస్తున్న డబ్బుల్లో ఈ ముగ్గురన్నలకు ఎంత వాటా ఇస్తున్నావు? బెంగుళూరులోని దేవనళ్లి, హోస్ కోట దగ్గర ఈ అవినీతి డబ్బుతో 11 ఎకరాలు కొని అగ్రిమెంటు చేయించుకున్నావు. ముందు నేనడిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. భువనేశ్వరీ గారిని ఏకవచనంతో పిలవడానికి నీ స్థాయి ఏమిటి? మీ అన్న జగన్ రెడ్డి, మీ ఎమ్మెల్యేలు రామోజీ రావును తిడుతూ ఉంటే….అదే రామోజీ రావు గారి టీవీలో డబ్బులు కోసం నువ్వు జబర్ధస్త్ ప్రోగాంలు చేసుకుంటున్నావన్న సంగతి మరచిపోకు.
నీకు చేతనైతే నగరి ఎమ్మెల్యే వరద భాదితులకు సహాయం చేయి. జగన్ రెడ్డి నగరికి వస్తే పోటోలు దిగి సజ్జలకు చూపించుకుని పదవి కోసం కక్కుర్తి పడే నీకు భువనేశ్వరీ గారిపై మాట్లాడే అర్హత లేదు. నీకు ఉచ్చ, నీచాలు లేవు. నీకు రాజకీయ బిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ, ప్యాకేజీల కోసం పార్టీ ని వదిలేసిన నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడుతావా?
నువ్వంటే నీ వైసీపీ కార్యకర్తలకే గౌరవం లేదు. మంత్రి పదవి కోసం చీఫ్ ట్రిక్స్ ప్లే చేసే నీకు మా మేడం గురించి మాట్లాడే అర్హత లేదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే నాలుక తెగ్గొస్తాం. నువ్వు చేనేత వాళ్లను నువ్వు ఏ విధంగా మోసం చేస్తున్నావో ఆధారాలతో సహా బయట పెడుతా. మంత్రి పదవి కోసం మీ జగన్ రెడ్డిని కావాలంటే పొగుడుకో…అంతేకానీ మా మేడం గురించి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త.