అభినవ రక్త పిశాచాలుగా వైసీపీ నేతలు

Spread the love

– టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై హత్యాయత్నం దుర్మార్గం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

క్రూర జంతువుల కంటే దారుణంగా రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు తయారయ్యారు. మనుషుల రక్తం తాగి ఆనందించిన రాజులను చరిత్రలో చూశాం. అలాంటి నియంతలను, క్రూరులను కూడా వైసీపీ నేతలు మించిపోతున్నారు. ప్రశ్నించిన వారిని తమను ప్రశ్నించేవారే ఉండకూడదు.

ఎందురించిన వారు బ్రతికి ఉండకూడదు అనేలా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వైసీపీ నేతల క్రూరత్వానికి సజీవ సాక్ష్యం. ఫిట్స్ తో ఇబ్బంది పడుతున్న వ్యక్తిని మద్యం బాటిళ్లతో కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో చెప్పడానికి నిదర్శనం.

గతంలో నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్త కాలు విరగ్గొట్టారు. ఇప్పుడు పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడిచేసి, హత్యలు చేసి పైశాచిక ఆనందం పొందొచ్చు. కానీ.. రేపు అనేది ఒకటి ఉందనే విషయం వైసీపీ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. ఈ రోజు మా కార్యకర్తలకు జరిగిన ప్రతి దాడికీ సమాధానం చెప్పడం తధ్యమని గుర్తుంచుకోవాలి. వెంకటనారాయణకు ఏం జరిగినా అందుకు జగన్ రెడ్డే బాధ్యత వహించాలి. ప్రతి కార్యకర్తకూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ప్రతి దాడికీ సమాధానం చెప్పడం తధ్యమని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి.

Leave a Reply