బంతి ఎంత బలంగా గోడకేసి కొడితే అంతే బలంగా ఎదురొస్తుంది . మంత్రి రోజా మాట్లాడిన మాటలు ,మహిళా సమాజం తలదించుకునే విధంగా ఆమె ప్రవర్తన, ఆమె ఆహా భావాలు, చూసిన వారికి ఎవరికైన జుగుప్తకరంగా ఉంటుంది . రాజకీయ నాయకురాలు వేరు ఈటీవీ జబర్దస్త్ షో వేరు. జనసేన కార్యకర్తలు సహజంగా ఏ వయసులో ఉంటారో అందరికీ తెలిసిందే వారితో మీరు తొడ కొట్టడం , బట్టలు ఇప్పి తంతా అని మాట్లాడడం , కోసి ఉప్పు కారం పెడతనని (మరి ఎక్కడో) అనడం ,నీ అమ్మ మొగుడు అని మాట్లాడడం చూస్తే( ఇవన్నీ వీడియోలో వచ్చిన విషయాలు) జనసేన కార్యకర్తలు ఈ మాటలకు ఏమి మాట్లాడకుండా గమ్మున ఉంటారనుకుంటే అది చాలా పొరపాటే. కచ్చితంగా అంతకు రెండింతలు మాట్లాడి ఉంటారు. కారణం ఎవరు?.
గతంలో నుంచి రోజా ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాంలో వారు చేస్తున్న, మాట్లాడుతున్న డబల్ మీనింగ్ మాటలు, ఆమె డాన్సులు ఇవన్నీ కూడా సమాజానికి తెలుసు. ఇకపోతే జోగి రమేష్ మంత్రి , తన పదవి పదిలం చేసుకొనే దానికోసం వారు పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీని ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సమాజానికి తెలుసు. పవన్ కళ్యాణ్ అశేష జన సందోహం తోటి.. విమానాశ్రయం నుండి వారు బస చేయనున్న నోవోటల్ హోటల్ వరకు, వారి కార్యకర్తల కేరింతలు, నినాదాలు చూసి వైసిపి నాయకులు తట్టుకోలేక.. ఎయిర్ పోర్ట్ నుండి నోవోటల్ కి పోయే దారిలో కరెంటు సదుపాయం లేకుండా తీసివేశారు. ఇటువంటి దుశ్చర్యలను సమాజం ఖండించాలి.
జనసేన జనవాణి కార్యక్రమం, మూడు నెలల క్రితమే నిర్ణయం జరిగిందని వారి పార్టీ చెబుతుంది. పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నారంట. వైఎస్సార్సీపీ విశాఖ గర్జన వారం రోజులు ముందు నిర్ణయమైంది . విశాఖ గర్జన మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తయింది. పవన్ కళ్యాణ్ సాయంత్రం 4:40 గంటలకు విశాఖపట్నం వచ్చారు. మరి పోలీస్ కు నిజంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందేమో! కంట్రోల్ చేయాల్సి వస్తుందేమో! అని అనిపిస్థే ఈ విధంగా జరిగి ఉండేది కాదు. రెండు కార్యక్రమాలు ఒకేరోజు జరుగుతున్నాయని గొడవలు జరగవచ్చేమోనని వారి దృష్టికి వచ్చినప్పుడే, ఎవరినైనా మార్చుకోమని ఆదేశించే అధికారం డిజిపికి ఉంద .
ఎక్కడా కూడా వారు తరలించిన జనానికి ,జనసేన కోసం తరలివచ్చిన జనానికి ఎదురుపడిన సంఘటనలు ఏమీ లేవు. కేవలం ఈరోజున జనసేనను ఏదో ఒక రకంగా నిలుపుదల చేయకపోతే, ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు.. రోజురోజుకు పార్టీ అభివృద్ధి చెందుతూ , బిజెపి సహాయ సహకారాలతో మనకు ఎక్కడ ముంపు, ముప్పు వస్తుందో అనే అభిప్రాయం, నిర్ణయం తోటి ఈ విధంగా జనసేనను కట్టడి చేయడానికి ప్రయత్నం చేశారు .