Suryaa.co.in

Andhra Pradesh

ప్రపంచ నలుమూలలకూ ఆర్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ ఉత్పత్తులను విస్తరించాలి

-గుడివాడలో షోరూంను ప్రారంభించిన మంత్రి కొడాలి నాని

గుడివాడ, డిసెంబర్ 20: ప్రఖ్యాత స్పోర్ట్స్ వేర్ కంపెనీ ఆర్ఆర్ స్పోర్ట్స్ తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రపంచ నలుమూలలకూ విస్తరింపజేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచించారు. గుడివాడ పట్టణం ఏలూర్ రోడ్డులోని జీవీఆర్
20-PHOTO-1కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్ స్పోర్ట్స్ వేర్ ఎక్సక్లూజివ్ అవుట్లెట్ ఫ్రాంచైజీ ఎస్వీ ఎంటర్ప్రైజెస్ ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో ఆర్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ ఉత్పత్తులు ట్రాక్ సూట్స్, టీ షర్ట్స్, లోయర్స్, షార్ట్స్, అథ్లెటిక్స్ ఎక్విప్మెంట్స్, స్పోర్ట్స్ యూనిఫామ్స్ తదితరాలను పరిశీలించారు. ఆయా ఉత్పత్తుల తయారీ ప్రక్రియ, నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ వ్యవస్థాపకురాలు రిపబ్లిక్ రాణి మాట్లాడుతూ క్వాలిటీ, వాల్యూ ఫర్ మనీ లక్ష్యంతోనే ఆర్ఆర్ కంపెనీ ఉత్పత్తుల తయారీ ప్రక్రియ జరుగుతోందన్నారు. తొలి స్పోర్ట్స్ వేర్ తయారీ కంపెనీగా ఆర్ఆర్ స్పోర్ట్స్ నిరంతరం విస్తరిస్తూనే ఉందన్నారు. 10 లక్షలకు పైగా కస్టమర్లు ఆర్ఆర్ కంపెనీ స్పోర్ట్స్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారని చెప్పారు.

అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ క్రీడాకారుల అభిరుచికి తగ్గట్టుగా స్పోర్ట్స్ యూనిఫామ్ ను ఆర్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ తయారుచేసి అందించడం అభినందనీయమన్నారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను కొత్తగా నేర్చుకునే వారికి కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం వల్ల క్రీడాకారులు ఆయా క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కలుగుతోందన్నారు. క్రీడల్లో శిక్షణ పొందుతున్న వారి అవసరాలకు
20-PHOTO-3తగ్గట్టుగా రక్షణ వస్తువులను కూడా అందజేయడం జరుగుతుందన్నారు. క్రీడాస్ఫూర్తిని పెంపొందించే, క్రీడల్లో ఆసక్తిని పెంచే విధంగా ఆర్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తులను క్రీడాకారులందరూ వినియోగించుకోవాలన్నారు. గుడివాడ ప్రాంత క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన ఈ షోరూంను ప్రతి ఒక్కరూ ఆదరించాలని అన్నారు. ముందుగా మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాన్ని ఎస్వీ
20-PHOTO-4ఎంటర్ప్రైజెస్ అధినేత బీ శివధర్మేంద్ర అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాలడుగు రాంప్రసాద్, పిల్లి బెనర్జి (బెన్ను), లోయ రాజేష్, గుత్తా నాని, కాసుల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE