– చేసిన తప్పులకు జైలుకు పోతానని కేటీఆర్‌కు తెలుసు
– అందుకే కేటీఆర్ పదేపదే జైలుకు పోతా అంటున్నాడు
– మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు
అమరావతి: గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆరోపించారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పని చేశారని గుర్తు చేశారు. తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నట్లు చెప్పారు. గురుకులాల కుట్రల వెనుక ఆయన హస్తం ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో హాస్టళ్లలో భోజనంలో పురుగులు వచ్చేవన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు కొరవడినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యార్థిని మృతిని రాజకీయం చేయవద్దని కోరారు.
బీఆర్ఎస్ హయాంలో తాను కూడా ఎమ్మెల్యేగా ఉన్నానని, కానీ కేసీఆర్ లేదా కేటీఆర్ ఎప్పుడైనా ఎమ్మెల్యేలను కలిసి సమస్యలు విన్నారా? అని ప్రశ్నించారు. కనీసం వారు మంత్రులకు కూడా దొరకలేదని, కానీ ఈరోజు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలు ఐదేళ్లు పాలించాలని అధికారం ఇస్తే ప్రభుత్వాన్ని దింపుతానని సైకోరావు అనడం విడ్డూరమని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.
మంత్రి కొండా మీడియాతో మాట్లాడుతూ, సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదే. తమ ప్రభుత్వం వచ్చాక హాస్టల్లో ఓ విద్యార్థిని చనిపోయింది. దురదృష్టవశాత్తూ చనిపోయింది. ఆమె మృతిపై రాజకీయం చేయవద్దని కోరారు.
కేటీఆర్ ఏదో తప్పు చేసినట్లున్నాడని, అందుకే జైలుకు పోతానని పదేపదే అంటున్నాడని మంత్రి అన్నారు. గిరిజనుల కోసం జైలుకు పోతానంటున్నాడు. మూసీ నది కోసం జైలుకు పోతానని అంటున్నాడు. కానీ తాను చేసిన తప్పులకు జైలుకు పోతానని కేటీఆర్‌కు తెలుసు. అందుకే ప్రజల కోసం జైలుకు పోతానని అంటున్నాడని మంత్రి కొండా సురేఖ విమర్శించారు.