– నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి
నంద్యాల: ఆర్టీసి బస్సు ప్రయాణం సురక్షితమని, ప్రయాణికులు ఆర్ టీ సి బస్సు ల్లో ప్రయాణం చేయాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు . ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆర్టీసీ అధికారులు ప్రారంభించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలకు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జనాభా పెరగడం అదేవిధంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నూతన బస్సులను కేటాయించడం అందులో భాగంగా ఈరోజు 3 బస్సులను ఒక బస్సు ను శ్రీశైలం కు , రెండు బస్సులను హైదరాబాదుకు కేటాయిస్తూ వాటిని ప్రారంభించడం జరిగిందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వీలైనంత వరకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని కోరార.
అలాగే త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్నారని, ఇచ్చిన హామీని టీడీపీ ప్రభుత్వం అమలు చేయబోతోందన్నారు, ప్రజలు కోరిక మేరకే నూతన బస్సులను ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించడం జరిగిందని ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజల సమస్యలను తీర్చడంలో ముందుండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిపిడిఓ రజియా సుల్తాన, డాక్టర్ బాబాన్ , కౌన్సిలర్లు శ్రీదేవి , జైనాభి మరియు ఆర్టీసీ అధికారులు , టిడిపి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు