Suryaa.co.in

Andhra Pradesh

అక్రమ గ్రావెల్ తవ్వకాలతో కొండలను పిండి చేస్తున్న అధికార పార్టీ నాయకులు..

-మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య 

నందిగామ టౌన్ : నందిగామ పట్టణం మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారు గురువారం నాడు ఉదయం తన కార్యాలయంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ..

నందిగామ మండలం రాఘవాపురం కొండ నుండి అనుమతి లేకుండా యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తుంటే అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారా?అధికార పార్టీ నాయకుల ధనదాహానికి గట్లు,కొండలు సైతం హడలెత్తే పరిస్థితి.గురువారం నాడు ఉదయం అక్రమ గ్రావెల్ తవ్వకాలతో ప్రొక్లైన్ డ్రైవర్ కి తీవ్ర గాయాలవ్వడం అధికార పార్టీ నాయకుల అక్రమ గ్రావెల్ త్రవ్వకాలకు ప్రత్యక్ష నిదర్శనం.

గత కొంత కాలంగా రాఘవాపురం కేంద్రంగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతుంటే అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్ళాము.అక్రమ గ్రావెల్ తవ్వకాల్లో అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ఈరోజు ఈ ఘటన జరిగింది.ప్రజా వ్యవస్థలో ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండవలసిన అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ వారి మత్తులో మాముళ్ళ ముసుగులో ఉండిపోతున్నారు.ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన అక్రమ గ్రావెలింగ్ పై పలుమార్లు మేము సంఘటన ప్రదేశాలకు వెళ్లి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాం అధికారుల చర్యలు మాత్రం శూన్యం.

అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రభుత్వ అధికారులు ఇలానే వ్యవహరిస్తే భవిష్యత్తులో తప్పక తగిన మూల్యం చెల్లించుకుంటారు.ఈ రోజు నందిగామ మండలం రాఘవాపురం వద్ద జరిగిన అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై జిల్లా అధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం

LEAVE A RESPONSE