– 15 డిమాండ్లతో కూడిన తీర్మానాలతో వైసీపీ ప్రభుత్వానికి రైతు పోరు అల్టిమేటం
– రైతులే జగన్ సర్కారుకు సమాధి కట్టబోతున్నారు
– టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోన్‌రెడ్డి
– సోమిరెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లిలో రైతు పోరు సూపర్ సక్సెస్
– మనుబోలు వేదికగా సాగిన రైతుపోరుకు నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వేలాదిగా పోటెత్తిన అన్నదాతలు
– రైతు గెలవాలి-వ్యవసాయం నిలవాలనే నినాదంతో కదంతొక్కిన రైతులు
వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలనే మంకుపట్టును వీడాలని, రైతులకు తక్షణమే ధాన్యం బకాయిలు చెల్లించాలని, ఆక్వా రంగానికి షరతులు లేకుండా యూనిట్ రూ.1.50కి విద్యుత్ ఇవ్వాలని తదితర 15 డిమాండ్లతో కూడిన తీర్మానాలతో వైసీపీ ప్రభుత్వానికి రైతు పోరు అల్టిమేటం ఇచ్చింది.
రైతుల సమస్యలను సీఎం వద్ద ప్రస్తావించే దమ్ము ఒక్క మంత్రికి కూడా లేదని ఆగ్రహం…రైతుల గురించి మాట్లాడే హక్కే ఈ ప్రభుత్వానికి లేదని టీడీపీ నేతలు మండిపడ్డారు. జగన్ రెడ్డి అవలంబిస్తున్న రైతు వ్యతిరేక నినాదాలపై ధ్వజమెత్తిన నాయకులు…ఇప్పటికైనా తీరుమార్చుకోకపోతే అన్నదాతల ఉసురుతప్పదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోన్‌రెడ్డి మాట్లాడుతూ… రైతుద్వేషి అయిన వైసీపీ సర్కారు పతనానికి ఈ రైతుపోరు సభ నాందిపలకబోతోందని జోస్యం చెప్పారు. రైతులను అప్పులపాలు చేసి, వారిని ఆత్మహత్యల దిశగా నడిపిస్తున్న జగన్‌రెడ్డి సర్కారుకు, రైతు ఉసురు తగిలితీరుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రైతులే జగన్ సర్కారుకు సమాధి కట్టబోతున్నారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు మేలుచేసిన చంద్రబాబు నాయుడు గత సర్కారును రైతులు మళ్లీ గుర్తుతెచ్చుకోవడం శుభపరిణామన్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రైతుపోరులో పాల్గొన్న మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, దూళిపాళ్ల నరేంద్రకుమార్, కూన రవికుమార్, నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డి, బీద రవిచంద్ర, పనబాక లక్ష్మి, ఎన్.అమర్నాథ్ రెడ్డి, గొల్ల నరసింహ యాదవ్, పులివర్తి నాని, నూకసాని బాలాజీ, గంటా నరహరి, డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి, దొరబాబు, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, మాలేపాటి సుబ్బానాయుడు, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కురుగొండ్ల రామక్రిష్ణ, పాసిం సునీల్ కుమార్, నెలవల సుబ్రహ్మణ్యం, బొజ్జల సుధీర్ రెడ్డి, మన్నూరు సుగుణమ్మ, జేడీ రాజశేఖర్, ముతముల అశోక్ రెడ్డి, కె.నారాయణ రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, నారపుశెట్టి పాపారావు, గూడూరి ఎరిక్సన్ బాబు, చల్లా రామచంద్రారెడ్డి, గాలి భానుప్రకాష్, బి.చిట్టిబాబు, బత్యాల చెంగల్రాయుడు, ఆర్.రమేష్ కుమార్ రెడ్డి, పంతగాని నరసింహప్రసాద్, కె.విశ్వనాథనాయుడు, జి.శంకర్ యాదవ్, పరసా వెంకటరత్నం, పిడతల సాయికల్పనారెడ్డి, కడగుంట్ల మధుబాబు నాయుడు, నారపుశెట్టి పిచ్చయ్య, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, వేనాటి సతీష్ రెడ్డి, రావూరి రాధాక్రిష్ణమనాయుడు, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, ఏలూరి వెంకటేశ్వర్లు, నాగల్లపాటి నాగేశ్వరరాజు, పీకే నాయుడు, ఆనం వెంకటరమణారెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్, గౌనివాని శ్రీనివాసులు, డాక్టర్ సప్తగిరి ప్రసాద్, డాక్టర్ ఎన్ఆర్ సుధాకర్ రెడ్డి, దామచర్ల సత్య, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, దివి శివరాం, గూటూరి మురళీకన్నబాబు, బొమ్మి సురేంద్ర, సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరయ్యారు.