Suryaa.co.in

Devotional

త్యాగానికి ఎప్పటికీ సత్ఫలితమే

తండ్రికోసం తనచక్కని వైవాహిక జీవితాన్ని త్యాగంచేసి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని గట్టి ప్రతిజ్ఞచేసి, తద్వారా భీష్ముడనే పేరు పొందడం తోబాటు, తన వంశజులైన కౌరవులను చివరికంటా అంటిపెట్టుకుని, కురుక్షేత్రయుద్ధంలో అర్జునుని బాణపుగాయానికి పడినప్పటికినీ, ఇచ్ఛామరణవరంవల్ల అంపశయ్యపై విశ్రాంతిని పొంది, ఉత్తరాయణం వచ్చినపిదప మాఘశుద్ధ అష్టమిరోజున నిష్క్రమించి, ముక్తిపథాన్ని చేరుకున్న మహానుభావుడు “భీష్మాచార్యుడు”.

భీష్ముని నియమనిబద్ధతను, ప్రతిజ్ఞాపాలనను, అద్భుతమైన శక్తియుక్తులను అభిమానించిన శ్రీకృష్ణభగవానుడు భీష్మమరణానంతరం వచ్చే ఏకాదశిపర్వదినాన్ని “భీష్మ ఏకాదశిగా” ప్రకటించిన వివరం భారత ఇతిహాసంద్వారా అవగతమౌతుంది. తనత్యాగానికి ఉత్తమగతులు పొందడంతోబాటు, తనపేరున పర్వదినాన్ని అందుకోగలగడం భీష్ముని మహద్భాగ్యం.విష్ణుసహస్రనామ పారాయణ ఈ పర్వదిన ప్రత్యేకత..త్యాగాలెప్పుడూ గొప్పవే! తద్వారా వచ్చే సత్ఫలితాలున్నూ మరింత గొప్పవే!

-కాశ్యపస

LEAVE A RESPONSE