Suryaa.co.in

Political News

చార్జిషీట్ కూడా లేకుండా 8 ఏళ్ళు జైలులో మగ్గిన సాధ్వీ ప్రగ్యా

– మగ పోలీసులు బ్లూఫిలింలు చూపించేవారు
– బలవంతంగా మాంసం తినిపించేవారు
– మరుగుదొడ్డి కూడా 8 ఏళ్లు కడిగించలేదు
-అన్నీ మౌనంగా భరించిన సాధ్వీ ప్రగ్యా

ఆమెను కర్రతో (లాఠీతో) దారుణంగా కొట్టిన హేమంత్ కర్కరే అనే ఐపీఎస్ ఆఫీసర్ (కాంగ్రెస్ తొత్తు) ఎప్పుడో చచ్చాడు..కుట్ర వెనుక నున్న సుషీల్‌కుమార్షిండే రాజకీయాల నుంచి కనుమరుగై వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక మిగిలింది చిదంబరం మరియు డిగ్గీరాజా.

అమెను ఎంతగా హింసించారంటే:
1) ఆమెకు ఎదురుగా ఎల్‌సీడీ టీవీని పెట్టి అందులో నీలిచిత్రాలు ప్రదర్శించేవారు.
2) సన్యాసినులను విపరీతంగా ద్వేషించే మగ పోలీసులను ప్రత్యేకంగా పిలిపించి, వారిచేత లాఠీలతో
sadwi-dis “ఆమెను ఎక్కడైనా కొట్టండి మాకు అభ్యంతరం లేదు..” అని చెప్పి మరీ దారుణంగా కొట్టించారు.
3) ఆమెను కాలకృత్యాలు తీర్చుకోనీకుండా కావాలనే బంధించే ఉంచేవారు. ఒక్కోసారి ఆమె ఏడుస్తూ ఉన్నచోటే కాలకృత్యం చేసేవారు.
4) పిచ్చిదాన్ని చేయాలని కరెంటు షాక్ ఇచ్చేవారు. స్పృహ తప్పి పడిపోయేటపుడు కుర్చీ చూపించేవారు. కూర్చునేటప్పుడు కుర్చీ లాగేసేవారు.
5) కొన్నిరోజుల పాటు ఆహారం ఏదీ అందించకుండా, సొమ్మసిల్లి పడిపోయిన తరువాత, మాంసాహారాన్ని పెట్టేవారు, అది కొంత తిన్న తరువాత తను తిన్నది మాంసమని అర్థమై వాంతులు చేసుకునేవారు. (ఆ
sadhvi విధంగా ఓ సారి 24 రోజులపాటు ఆమె ఆహారం లేకుండా ఉన్నారు)
6) ఆమెకు కేటాయించిన రూముగానీ, బాత్‌రూమును గానీ 8 ఏళ్ళూ కావాలనే శుభ్రం చేయించలేదు.
7) కుళ్ళిన ఆహారం, రసాయనాలు కలిపిన ఆహారం తినడంతో ఆమెకు జీర్ణాశయ క్యాన్సర్ సోకింది. గదిలో గంటలు గంటలు నిశ్చలంగా మెడిటేషన్ చేస్తూ క్యాన్సర్‌ను తగ్గించుకున్నారు.
ఇవీ.. సాధు సన్యాసులపై కాంగ్రెస్ అకృత్యాలు.
(ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలన్నీ రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే)

– పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిలభారత ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు

LEAVE A RESPONSE