రామచంద్ర గుహ అని ఒక పేరు మాసిన గొప్ప వామపక్ష చరిత్రకారుడు.. చరిత్ర గురించి పరిశోధన చెయ్యడానికి అని ఈయన BA, MA లో ఎకనామిక్స్ చదివి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ మేనేజిమెంట్ కలకత్తా నుండి అడవులు పై Phd చేసి చరిత్రకారుడు గా రూపాంతరం చెందాడు. ఈయనకు ఉన్న పెద్ద అర్హత లేదా క్వాలిఫికేషన్ ఏమిటంటే ఈయన నెహ్రూ కుటుంబ బానిస. అందుకే అర్జంటుగా గుర్తింపు సంపాదించేశాడు.
2014 లో మోడీ వచ్చిన దగ్గర నుండి అందరు వామపక్ష చరిత్ర కారుల లాగే మోడీ అధికారంలోకి రావడం భారత దేశానికి ఎంత ప్రమాదమో నెహ్రు గారు విదేశాల నుండి దిగుమతి చేసుకున్న సెక్యూలరిజం భారత్ లో ఎలా సర్వనాశనం అయిపోతుందో పుంఖాను పుంఖాలుగా దేశ విదేశీ మేగజైన్లలో వ్యాసాలు రాసుకుంటూ వస్తున్నాడు. పాపం 2014 ఎన్నికలు ముందు కూడా ఇటువంటి వ్యాసాలు పలు రాసినా భారత్ లో ప్రజలు ఈ మేధావి సూచనలను పట్టించుకోకుండా 2014లో మోడీకి అధికారం కట్ట బెట్టారు.
పూర్వం ప్రింట్ మీడియా మాత్రమే వున్నప్పుడు ఈ ఇర్ఫాన్ హాబీబ్ లు, రోమిల్లా లు, గుహలు వామపక్ష భావజాలానికి అనుకూలంగా భారత్ చరిత్రను వక్రీకరిస్తూ పుస్తకాలు రాసి, వ్యాసాలు రాసి గొప్ప చరిత్రకారులుగా పేరు సంపాదించారు. ఆ వ్యాసాల ను ఖండించి రాసే వ్యాసాలకు ఎప్పుడో కానీ ప్రింట్ మీడియాలో చోటు దొరికేది కాదు..ఇక లెటర్స్ టూ దీ ఎడిటర్ వంటి వాటికి ఉత్తరాలు పంపించినా వేసుకునేవారు కాదు లేదా బాగా ఎడిట్ చేసి వేసేవారు…పాపం అలా ఆ కాలంలో రక్షణ గోడల మధ్య గొప్ప చరిత్రకారులు గా పేరు సంపాదించేసుకున్నారు.
అయితే వీళ్ళ ఖర్మ కాలి టెక్నాలజీ పెరిగి (అందుకే చూడండి వామపక్షాలు మొదటి నుండి టెక్నాలజీ అభివృద్ధి కి వ్యతిరేకమే) ఇంటర్నెట్ సోషల్ మీడియా రావడంతో ఎక్కడికి అక్కడ వీళ్ళ తప్పుడు రాతలపై సాక్ష్యాలతో సహా సామాన్యులు ఎదురుదాడి చేయడం ప్రారంభించారు.. అది వీరు ఊహించని పరిణామం..సరే రెగ్యులర్ గా ఈయన చరిత్రను వక్రీకరిస్తూ మోడీని, హిందుత్వాన్ని విమర్శిస్తూ ఎవో వ్యాసాలు రాస్తూ ఉండడం ఇటువైపు వాళ్ళు అతన్ని ట్విట్టర్ లో ఆడుకోవడం సర్వసాధారణం అయిపోయింది.
సాధారణంగా ఒక పుస్తకం కానీ వ్యాసం కానీ ఫేస్‌బుక్ లో పోస్ట్ కానీ కనీసం నాలుగు వ్యాఖ్యల ట్వీట్ పెట్టె ముందు మనం రాసే దానికి స్పందన ఎలా ఉంటుంది? మనం రాసింది కరెక్టేనా? గతంలో ఇటువంటివి జరిగాయా,? జరిగితే వాటిపై మనం స్పందించిన విధానం ఏమిటీ? తిరిగి దానిపై ఎవరైనా స్పందిస్తే జవాబు ఇవ్వడానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయా ఇలా చాలా అలోచించి కానీ రాయరు. గుహ వంటి పేరు మాసిన రచయితలు అయితే రాసే ముందు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ తీసుకోరు. కారణం మేము గొప్ప పేరు మాసిన చరిత్రకారులం మమ్మల్ని ఆధారాలతో ప్రశ్నించే దైర్యం ఎవరికి ఉంది అని నిలువెల్లా అహంభావం.
ఈ జబ్బుతోటే నిన్న ఈ గుహ ఒక ట్వీట్ పెట్టాడు.. మోడీ కేదార్నాధ్ యాత్ర తన కడుపులో గ్యాస్ పెంచితే ఏ ఇనో తాగి ఇంట్లో పడుకోవాలి. అంతే కాని ఆ ఉబ్బరం తగ్గించుకుందుకి ఓ తప్పుడు ట్వీట్ పెట్టి ఉపన్యాసం ఇస్తే గతంలో లాగా ఆహా ఓహో అనడానికి ఎవరూ మిగలేదు. ఇప్పుడు అటువంటి ఏడుపుగొట్టు ట్వీట్స్ పెడుతున్నందుకు చీల్చి చెండాడుతున్నారు.
ఇంతకీ ఆయన పెట్టిన ట్వీట్ ఏమిటంటే
“ప్రధానికి దేవాలయాలు దర్శించుకోవాలి అని ఉంటే అది ప్రైవేట్ గా కెమెరాలు, జనాలు లేకుండా చేసుకోవాలి.. ఇలా ప్రభుత్వ ఖర్చుతో చేయడం అసహ్యకరం, అతని ఆఫీస్ విలువను తగ్గించే చర్య.” అని పాపం ట్వీటాడు.అంతే ఇంకేముంది కాషాయగాళ్ళు అతని మీద పడిపోయారు.
ఏం నాయనా! నెహ్రు నుండి నేటి రోహన్ వరకు కుటుంబం ఎక్కడికి పోయినా ప్రైవేట్ ఖర్చు పెట్టుకునే వారా? వెనకాల కెమెరాలు మంది మార్బలం లేకుండా వెళ్ళేవారా? ప్రధాని పబ్లిక్ గా పరాయి స్త్రీల తో పరచకాలడటం పడీ పడీ నవ్వడం ప్రధాని పదవి ప్రతిష్ట పెంచే చర్యలా నాయనా? మోడీ మీ నెహ్రు కుటుంబం లాగా ప్రభుత్వ ఖర్చుతో డజన్ల కొద్దీ మంది మార్బలంతో విదీశీ టూర్లు, డిఫెన్స్ షిప్పులలో అండమాన్ దీవులకు, లక్ష ద్వీప్ దీవులకు పోవడం లేదు కదా?
అలాగే మిగతా అందరూ ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రభుత్వ ఖర్చుతో దేవాలయాలు, గోల్డెన్ టెంపుల్, మసీదులు, దర్గాలు చర్చలు కెమెరాలు, మంది మార్బలం వెంట వెళ్లగా చూడలేదా? ఇఫ్తార్ పార్టీలు. పెట్టడం లేదా?
అప్పుడు ఎప్పుడూ ఆ విషయాలు తప్పుగా కనిపించని నీ సెక్యూలర్ కళ్ళకు ఇప్పుడు ప్రధాని తన మత హిందుత్వాన్ని ప్రదర్శిస్తే తప్పుగా కనిపిస్తున్నాయి అంటే మోడీ , హిందుత్వ అంటే అంత కడుపు మంట తప్ప ఇంకేమి కాదు..ఒక వ్యక్తి అంటే ఇంత మంట ఏంది స్వామి? కడుపు మంట అయితే పోయి ఇనో, డైజిన్ వేసుకో కింద కాలితే బర్నాల్ పూసుకో అని సలహాలు ఇచ్చి పడేసారు.పాపం పెద్దాయన రాత్రి నిద్ర పోయాడో లేదో?
అన్నట్లు దీనిపై నెహ్రు ఫ్యామిలీని సమర్ధించుకుందుకి ఏం లేక మన ఫేస్ బుక్ మేధావులు వాడే చివరి జవాబు..”వారు అలా చేశారు అనే కదా దింపేసి మీకు అధికారం” ఇచ్చాము అనే డిఫెన్స్ లోకి దిగజారిపోతారు.
హెచ్చరిక : అన్నట్లు ఈ మేధావి వ్యాసాలు రెగ్యులర్ గా డ్రైనేజి పేపర్లో వస్తూ ఉంటాయి. దూరంగా ఉండండి. లేకపోతే ఆ కంపుకి మన మెదళ్లు కూడా కుళ్లిపోతాయి.