– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: నాడు తెలంగాణ ఇవ్వకుండా శ్రీకాంతాచారిని, నేడు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా సాయి ఈశ్వర్ ను బలి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కులగణన పేరుతో హంగామా చేశారు. చెల్లదు అని తెలిసినా అసెంబ్లీలో తీర్మానం చేశారు. నాటకీయంగా ఢిల్లీలో ధర్నా చేశారు .. గవర్నర్ ఆమోదించాలని ఒత్తిడి చేశారు.
చివరకు చేతులు ఎత్తేసి .. 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే సర్పంచ్ ఎన్నికలు పెట్టారు. కాంగ్రెస్ మోసం తట్టుకోలేక సాయి ఈశ్వర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మన హక్కులను పోరాడి సాధించుకుందాం .. ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు. ఏదైనా రాజ్యాంగబద్ధంగా మాత్రమే సాధ్యం .. కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మొద్దు. ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకుని బలిదానాలకు కారణం అయిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి మోసాలు కొత్త కాదు. కలసికట్టుగా పోరాడి హక్కులను సాధించుకుందాం.