-వరద బాధితుల పరామర్శ పేరుతో బాబు రాజకీయ యాత్ర
-సీఎం వైయస్ జగన్‌ను ఎదుర్కొనే శక్తిలేకే ప్రతిపక్షాల ఆరోపణలు
-సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం
-టీడీపీ హయాంలో రూ.1.10 లక్షల కోట్లకు లెక్కలు లేవు
-కేంద్ర నిబంధనలకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయి
-ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి గత ప్రభుత్వం అప్పులు చేసింది-సీఎం
వైయస్ జగన్ పాలనపై బురద జల్లడమే ఈనాడు పత్రిక పని
-కోవిడ్ సంక్షోభం కారణంగా ఏపీకి ఆర్థిక ఇబ్బందులు
-వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
వరద బాధితుల పరామర్శ పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ యాత్ర చేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లి జిందాబాద్‌లు కొట్టించుకుంటున్నారని తప్పుపట్టారు. వరద బాధితుల గురించి మాట్లాడటం మరిచిపోయి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సీఎం వైయస్ జగన్‌ను ఎదుర్కొనే శక్తిలేకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభానికి గల కారణలను సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. సీఎం వైయస్ జగన్‌కు వస్తున్న ఆదరణ, సానుకూల ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉహించిన దానికంటే ఎక్కువగా ప్రజలకు మేలు జరుగుతోంది. రాజకీయంగా ఎదుర్కోనే శక్తి లేక ప్రతిపక్ష నేత చంద్రబాబు, దుష్టచతుష్టయం అందరూ ఏకోన్ముకంగా దాడి చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళ తీసిందని విష ప్రచారం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరం.
ఇటీవలే పార్లమెంట్లో టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు హయాంలో రూ.1.10 లక్షల కోట్లకు లెక్కలు చెప్పలేకపోయారని కేంద్రం చెప్పింది. ఈ వార్త ఎల్లో మీడియాలో ఎక్కడా కూడా కనిపించలేదు. టీడీపీ తీసిన గోతిలో అదే పడింది.
దీర్ఘకాలంగా ప్రముఖ దినపత్రికను నడుపుతున్న ఈనాడు రామోజీ రావు, రాజకీయంగా తానే శాసించగలను అని కలలు కంటున్నాడు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కొన్న చంద్రబాబు.. చరిత్రహీనుడిగా మిగిలారు. ఆ రోజు చంద్రబాబు ఎన్టీఆర్‌కు చే సిన అక్రమాన్ని కూడా సక్రమంటూ ఆ రోజు ఈనాడు ప్రచారం చేసింది. ఈ రోజుకు అదే పంథాను కొనసాగిస్తూ చంద్రబాబు ఏది చెబితే ఈనాడు అదే రాస్తోంది. రోజు రాసిందే రాస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతోంది. ఈ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ఎన్నుకున్న సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని దెబ్బకొట్టాలని, అప్పులు దొరకకూడదని, దుబారా చేస్తున్నారన్న అభిప్రాయాన్ని తెచ్చేందుకు ఈనాడు రోజువారీగా ప్రచారం చేస్తోంది.
గత కొద్దిరోజులుగా ఇదే ప్రచారం చేస్తూ ఈ రోజు ఇదే బ్యానర్ ఐటెంగా రాశారు. ఇవాళ చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లి ఇదే అంశం గురించి మాట్లాడారు. ఎక్కడా కూడా వరద గురించి మాట్లాడలేదు. చంద్రబాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేయించున్నారే తప్ప ఎక్కడా వరద గురించి మాట్లాడలేదు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన పెద్ద మనిషి దాదాపు 12 కిలోమీటర్ల రోడ్డు షో నిర్వహించారు. అక్కడక్కడ జిందాబాద్‌లు కొట్టించుకున్నారు. సమయం, సందర్భం లేకుండా ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టారు. తన హాయంలో తూపాన్ కంటే ముందుగానే వచ్చానని గొప్పలు చెప్పారు. నిన్న, ఇవాళ శ్రీలంకా గురించి చంద్రబాబు మాట్లాడారు.
వరద బాధితుల పరామర్శ పేరుతో రాజకీయ యాత్ర చేస్తున్నారు. బాధ్యతారాహిత్యానికి చంద్రబాబు తీరే నిదర్శనం. మీడియా కూడా అలాగే వ్యవహరిస్తోంది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు చెప్పిందే చెబుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈనాడు అంకెల్లో ఉండే డొల్లతననాన్ని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మీడియా వేదికగా ఎండగట్టారు.
ఇటీవల శ్రీలంకలో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభం గురించి అందరికీ తెలిసిందే. శ్రీలంక తీసుకున్న నిర్ణయాలే ఆ దేశ ఆర్థిక సంక్షోభానికి కారణం. విఫరీతమైన ఆహార కొరత ఉండటం, జీడీపీ 3.3 శాతానికి పడిపోవడం, అత్యధికంగా అప్పులు చేశారు. కోవిడ్ కారణం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా శ్రీలంకలో సంక్షోభం ఏర్పడింది.
కేంద్ర నిబంధనలకు లోబడే రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి గత ప్రభుత్వం అప్పులు చేసింది. రాష్ట్ర విభజన నాటికి 1.35 లక్షల కోట్లు ఉంటే మే వచ్చేనాటికి 3.45 లక్షల కోట్లు పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వం రూ.4.95 లక్షల కోట్లకు పెరిగింది. కోవిడ్ సంక్షోభం కారణంగా ఏపీకి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పూర్తిస్థాయిలో రాకపోవడంతో రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉత్పన్నమయ్యాయని దువ్వూరి కృష్ణ వివరించారు.