Suryaa.co.in

Telangana

శక పురుషుడు.. కారణజన్ముడు ఎన్టీఆర్

– సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా
– పార్టీ కార్యాలయంలో పేదలకు అన్నదానం, మహిళలకు చీరల పంపిణీ

శక పురుషుడు ఎన్టీఆర్ కారణజన్ముడని కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబు నివాళులర్పించారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు తెలుగుజాతి ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. ఆదివారం పార్టీ ఆఫీసులో పేదలకు అన్నదానం, మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అఖిల భారత ఎన్టీఆర్ అభిమానసంఘం వ్యవస్థాపక సంఘం అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ, మదరాసీలుగా పిలవబడే తెలుగువాళ్లకు భాషా స్వాతంత్య్రం తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటితే, చంద్రబాబు తెలుగువాడి తెలివిని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే టీడీపీ విధానమన్నారు.

తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో, టీడీపీకి పూర్వవైభవం రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలుగుదేశం హయాంలో జరిగిన నగరాభివృద్ధిని గ్రేటర్ ప్రజలు ఇంకా మర్చిపోలేదని, వాటిని ప్రజల వద్దకు వెళ్లి మరోసారి గుర్తుచేయాలని సాయిబాబా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శి పి.బాలరాజ్ గౌడ్, సిహెచ్ విజయశ్రీ, జియాదగిరి రావు, ఆర్.భాస్కర్, ప్రమీల, జాన్సి, పరుశురామ్, ఓ.వెంకటేష్ చౌదరి, శ్రీనివాస్ నాయుడు, నల్లా అనిల్, రామ్ చందర్ గుప్త, పెంటం రాజు, సిహెచ్ ప్రదీప్ గౌడ్, భవాని శ్రీనివాస్, వీరబాబు, ఎస్.ప్రకాష్, కిరణ్, ఎం.నర్సింహులు, సత్యనారాయణ, మజ్జి యాదగిరి., రాజు, సుధాకర్, భాను ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE