Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులుగా సాక్షి టివి ఎడిటర్ నేమాని భాస్కర్

జర్నలిస్ట్ నాయకులుగా ఎదిగి ప్రభుత్వంలో పదవులు పొందడం సర్వ సాధారణంగా మారిపోయింది! జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ గా వున్న సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టీవీ ఎడిటర్ నేమాని భాస్కర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా విధానాలు (పబ్లిక్ పాలసి) సలహాదారులుగా నియమితులయ్యారు.

నేమాని భాస్కర్ గా అందరికి సుపరిచితులైన ఎన్. వి. వి. ఎస్. భాస్కర రామం వివాదరహితుడుగా మంచి జర్నలిస్ట్ గా పేరు గడించారు! విశాఖపట్నం గాజువాక ఆంధ్రభూమి కంట్రిబ్యూటర్ గా భాస్కర్ పాత్రికేయ ప్రస్థానం ప్రారంభం అయ్యింది! అదే పత్రికలో హైదరాబాద్ పొలిటికల్ స్టాఫ్ రిపోర్టర్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు. Ntv సెక్రటేరియట్ బీట్ సీనియర్ రిపోర్టర్ గా, అనంతరం ఇన్ పుట్ ఎడిటర్ గా మారారు!

అక్కడ నుంచి కొన్నాళ్ళు ఎక్స్ ప్రెస్ టీవీ లో పని చేశారు. తరువాత సాక్షి టీవీ ఎడిటర్ గా సేవలు అందిస్తున్నారు. సాక్షి నుంచి ఇలా సీనియర్ జర్నలిస్ట్ గా ఆంధ్రప్రదేశ్ సలహాదారులుగా నియమితులయ్యారు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఇప్పటికే గతం లో సాక్షి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల సలహాదారుగా ఉన్నారు. జివిడి కృష్ణమోహన్, దేవులపల్లి అమర్ సలహాదారులుగా సేవలు అందిస్తున్నారు. ఎస్.ఎం.బాష సమాచార హక్కు కమిషనర్ గా నియమితులయ్యారు. ఇప్పుడు నేమాని భాస్కర్ కు అవకాశం లభించింది.

గతం లో ఈ పదవిని సీనియర్ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి గారికి ఇవ్వగా, ఆయన మధ్యలోనే రాజీనామా చేసేశారు! జర్నలిస్ట్ హోసింగ్ సొసైటీ కి అధ్యక్షులుగా వ్యవహరించిన క్రాంతి కిరణ్ ఆంధోల్ ఎమ్మెల్యే అయ్యారు! రెండవ సారి పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో దామోదర రాజనరసింహ చేతిలో ఓడిపోయారు!

మరో నేత పల్లె రవి కుమార్ కల్లు గీత కార్మికుల పారిశ్రామిక ఆర్ధిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన విషయం తెలిసిందే! అయితే ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేక పోయాడు! కెసిఆర్ తిరిగి అధికారం లోకి రాలేనందున ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అల్లం నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేశారు!

LEAVE A RESPONSE