Suryaa.co.in

Andhra Pradesh

15,20 తారీకుల వరకూ జీతాలు రావడం లేదు

-ఉద్యోగులను నిర్భంధం చేసే కొద్దీ వారిలో కసి పెరుగుతుంది
-ఏపీ జేఏసి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

గతంలో మా సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాలు చేశాం.ఇప్పుడు జీతాల కోసం ఉద్యమం చెయ్యాల్సి వస్తుందని భయమేస్తుంది. 15,20 తారీకుల వరకూ జీతాలు రావడం లేదు. ఇలాగే ఉంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా…ప్రవేటు ఉద్యోగం మేలు అన్న పరిస్థితులు వస్తాయి. సీపీఎస్ రద్దు కోసం ఏడేళ్లుగా ఉద్యోగులు అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. అందులో భాగంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 1న సీపీఎస్ రద్దు కోరుతూ నిరసన కార్యక్రమం ఉద్యోగులు చేస్తున్నారు. మూడేళ్లుగా సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఉద్యోగులను నిర్భంధం చేసే కొద్దీ వారిలో కసి పెరుగుతుంది. సీపీఎస్ ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలి.

LEAVE A RESPONSE