Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వరు కానీ… మద్యం షాపుల్లో పనిచేసే వారికి జీతాలు పెంచుతారట

ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించరు కానీ ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేసే వారితో మాత్రం జీతాలను పెంచుతారట అని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాలలో పని చేసేవారికి, గ్రామ వాలంటీర్లకు ఇచ్చినట్లు అవార్డులను ఇవ్వాలని అపహాస్యం చేశారు. మధ్యరత్న… మద్య సామ్రాట్ అవార్డు లు ఇవ్వాలన్న ఆయన, రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యానికి పూర్తిగా దెబ్బ తీశారని మండి పడ్డారు. మద్యం విక్రయాలు డిజిటల్ విధానంలో కాకుండా, నేరుగా నగదు తీసుకొని విక్రయించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని తాను పలుమార్లు ప్రస్తావించడం జరిగిందన్నారు. ఈనెల 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి లేఖ రాయడం జరిగిందని గుర్తు చేశారు. సూట్ కేసులను పంపి, క్షుద్ర శక్తులు ఎన్ని ప్రయోగించినా, వీటన్నింటినీ అతీతమైన వ్యక్తి ఒకరు ఉన్నారని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీ ని ఉద్దేశించి రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఆయనకు సమాచారం తెలియడం ముఖ్యమని, ఆ సమాచారాన్ని తనవంతుగా తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతాల కోసం హలో లక్ష్మణ అంటుంటే… సారా దుకాణాలలో పని చేసేవారు జీతాలు పెంచుతానని అంటే ఛీ…అనాలని అనిపిస్తుంది కానీ సభ్యత అడ్డు వస్తుంది అన్నారు.

అవినీతికి ఇక విరామట

రాష్ట్ర మంత్రులకు ఇకపై అవినీతికి దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశా, నిర్దేశం చేయడం అభినందనీయమని రఘురామకృష్ణం రాజు అన్నారు. అంటే ఈ నాలుగు ఏళ్ల పాటు రాష్ట్రంలో అవినీతి కార్యకలాపాలు కొనసాగాయని పరోక్షంగా ముఖ్యమంత్రి అంగీకరించినట్లేనని పేర్కొన్నారు. నిజాలను అంగీకరించాలంటే ఎంతో ధైర్యం కావాలని, ఆ ధైర్యం ఇప్పుడిప్పుడే తమ పార్టీ పెద్దలకు వస్తున్నట్లు కనిపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ల్యాండ్, సాండ్, వైన్, మైనింగులలో అడ్డగోలుగా దోచుకున్నారని, ఇక దోచుకోవడానికి మిగిలింది ఏమీ లేదన్నారు. అందుకే, అవినీతికి దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి మంత్రులకు, మంత్రులు తమ అనుచరులకు సూచిస్తున్నారన్నారు. అవినీతికి దూరంగా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.. ప్రజలు ఇప్పుడిప్పుడే చైతన్యవంతులవుతున్నారని, అందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్డు షోలకు విశేషంగా అశేష జనవాణి హాజరవుతున్నారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

సూట్ కేస్ ప్రయోగాలు… క్షుద్ర విద్యలు ఎక్కువకాలం నడవవు
సూట్ కేస్ ప్రయోగాలు, క్షుద్ర విద్యలు ఎక్కువ కాలం నడవవని అసలు విషయం పెద్దోడికి తెలిసిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఎన్నికైనట్లు తెలియజేయడం పై ఆయన స్పందిస్తూ… కంసుడైన జగన్ , నపుంసకుడు విజయసాయిరెడ్డి రాష్ట్రాన్ని ఎంతగా దోచుకున్నది ప్రజలందరికీ తెలుసునన్నారు.. అసెంబ్లీ చీఫ్ మార్షల్ గా ఏడుకొండలు రెడ్డిని నియమించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని గెలిచానని సాయి రెడ్డి చేసిన ట్వీట్ పై రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరి ఫోటో పెట్టుకొని గెలవలేదని, తన ఫేస్ వ్యాల్యూ తో ఎన్నికలలో గెలిచానని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి కి పనిచేయని జగన్ ఫోటో, తనకు ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. తాను పదే పదే విజయసాయిరెడ్డిని రెండు ప్రశ్నలు అడుగుతున్నానని, దానికి మినహా అన్నింటిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి తండ్రి తన పెద్ద సోదరుడిని హత్య చేసి జైలు జీవితం గడిపింది నిజమా?కాదా?, తన కుమార్తెగా చెప్పుకుంటున్న అమ్మాయి దత్తపుత్రికనా?, సొంత కుమార్తెనా? అన్నది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరొకసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే కీలక పదవి కట్టబెట్టడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.

పబ్లిక్ గా టెండర్ పిలిచి… డిపాజిట్ అడగవచ్చు
పబ్లిక్ గా టెండర్లను పిలిచి ఆసక్తి కలిగిన కంపెనీలను డిపాజిట్లు అడగవచ్చునని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. టెండర్లు ఎలా పిలుస్తారని సాక్షి దినపత్రికలో వార్తా కథనం రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవసరమైతే రామోజీరావు కూడా దరఖాస్తు చేయవచ్చునని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్న ఆయన, గండికోట, చిత్రావతి పంపుడ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులను పెద్ద కంపెనీ కి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం, మిగతా వారికి విద్యుత్ ఉత్పత్తి యూనిట్ కాస్ట్ ఆరు కోట్లు అవుతుందనుకుంటే, రిజర్వాయర్ రెడీగా ఉన్నవారికి సివిల్ కాస్ట్ లో 30 నుంచి 35% ఖర్చు కలిసి వస్తుంది అన్నారు. అటువంటి వారిని పీక్ స్టేజీ లో ఎంత మేరకు విద్యుత్ సరఫరా చేస్తారని బహిరంగ టెండర్ ఆహ్వానించవచ్చు కదా అని అన్నారు. మీరు ప్రైవేట్ గా డీల్ వేసుకొని, వారికి అప్పగించడం ఏమిటన్నారు. రెండు లక్షల రూపాయలు మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తికి వస్తుందని చెప్పారని, మౌలిక వసతులు ఉండి విద్యుత్ ఉత్పత్తి చేసేవారు అంతే మొత్తం, కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేసేవారు అంతే మొత్తం అంటే ప్రజలేమైనా చెవిలో పువ్వులు పెట్టుకున్నారా అని నిలదీశారు. క్యాపిటల్ కాస్ట్ తక్కువ అయ్యే వారిని ఎంత ఉచిత విద్యుత్ సరఫరా చేస్తావని అడగవచ్చునని, దానికి పబ్లిక్ గా టెండర్ పిలువ వచ్చునని… డిపాజిట్లు అడగవచ్చునని అన్నారు. రాష్ట్రంలో నువ్వు ఒక్కడివే పారిశ్రామికవేత్తవు కాదని, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారని పరోక్షంగా జగన్ పై విమర్శలు కురిపించారు. ప్రాజెక్టుల కేటాయింపులు పారదర్శకత లేదని విమర్శించారు. 70 నుంచి 80 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రామోజీ రావు దరఖాస్తు చేసుకున్న ఇస్తామని చెప్పడం ఏమిటి అన్నారు. ఎవరో ఏమిటో తెలియకుండానే ఇలా ప్రాజెక్టులు కేటాయిస్తారని, భూములు దారా దత్తం చేస్తారని ప్రశ్నించాను. ఇండో సోల్ అనే నిన్న మొన్న ఏర్పాటు చేసిన వేలకోట్ల ప్రాజెక్టులను కేటాయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అయినా, యాజమాన్యం అన్ని వనరులు కల్పిస్తే కానీ రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుండగా, 50వేల రూపాయలు చెల్లించడానికి కూడా సదరు కంపెనీ మెగా వాట్ కు 50 వేల డిపాజిట్ చెల్లించడానికి నిరాకరించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అయినా సరే క్యాబినెట్లో అదే కంపెనీకి ప్రాజెక్టులను కట్టబెట్టడంపై రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.. 50వేల రూపాయలు కూడా డిపాజిట్ చేయలేని వాడికి ప్రాజెక్టులను కేటాయించడం పారదర్శకత అంటూ ప్రశ్నించిన ఆయన, నువ్వు తగిన మౌలిక వసతులు కల్పించలేవని డిపాజిట్ చెల్లించేందుకు సదర్ కంపెనీ వెనకాడిందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అరబిందో ఫార్మా కంపెనీకి సారా వ్యాపారం చేయమని ఆ కంపెనీ వాటాదారులు ఏమైనా క్లియరెన్స్ ఇచ్చారా అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. లిస్టెడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ఏ వ్యాపారం పడితే, ఆ వ్యాపారం చేయడానికి వీలు లేదని… అలా చేస్తే ఏజీఎంలో చైర్మన్ పై తిరగబడతారని అన్నారు.

LEAVE A RESPONSE