Suryaa.co.in

Andhra Pradesh

సలహాదారులకు జీతాలు ఇస్తారు…. ఉద్యోగస్తులకు మాత్రం జీతాలు వేయరు

-ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించడం వెనుక కారణాలు ఏమిటో?
-సీబీఐ కేసుల నేపథ్యంలో వారు కొత్త గా మాట్లాడుతున్నారేమో
-ఐదు‌ వేల‌ కోట్లు ఇవ్వక పోవడం వల్ల పలు ప్రాజెక్టు లు ఆగిపోయాయి
-బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్

విజయవాడ : ఇన్నాళ్లూ ప్రత్యేక హోదా, ప్యాకేజీ గురించి మాట్లాడని వైసీపీ ఇప్పుడు హటాత్తుగా వాటి గురించి మాట్లాడం వింతగా ఉందని, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. ‘కేసుల నేపథ్యంలోనే వారు ఈవిధంగా మాట్లాడుతున్నట్లుంది. అభివృద్ధి-అవినీతి విషయంలో కేంద్రం రాజీ పడదు’అని స్పష్టం చేశారు. సత్యకుమార్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. ఏపీ అభివృద్ధి కోసం విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారు.విశాఖ మెట్రో నిర్మాణం ‌విభజన చట్టంలో ఉంది.రివైజ్ డి.పి.ఆర్ సమర్పించకుండా ఇచ్చినట్లు చెబుతున్నారు.ఐదేళ్ల పాటు కాలయాపన చేశారు… కారణాలు తెలియదు.ఇప్పుడు హఠాత్తుగా అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేంద్రం అభివృద్ధి, అవినీతి విషయంలో రాజీ పడదు.సీబీఐ కేసుల నేపథ్యంలో వారు కొత్త గా మాట్లాడుతున్నారేమో.

రైల్వే ప్రాజెక్టు ల‌ అభివృద్ధి కి ఎపి వాటా కింద నిధులు, స్థలాలు ఇవ్వడం లేదు.అప్పటి సిఎం‌ వై.యస్. తో చేసుకున్న ఒప్పందాలే. తనయుడిగా జగన్ తండ్రి ఒప్పందాలను అమలు చేయడం లేదు.కేవలం ఐదు‌ వేల‌ కోట్లు ఇవ్వక పోవడం వల్ల పలు ప్రాజెక్టు లు ఆగిపోయాయి.స్టీల్ ఫ్లాంట్, దుగరాజ పట్నం, మెట్రో, వంటివి మీరే పూర్తి చేస్తాం అని‌చెప్పారు. మిగిలిన ఏడు ప్రాజెక్టు లు కేంద్రం పూర్తి చేసింది కదా?ఈ మూడు మీ‌ నిర్లక్ష్యం ‌వల్లే ఆగింది‌ వాస్తవం‌ కాదా?అబద్దాలు, అసత్యాలు తో ప్రజలను మోసం చేస్తారా?వైసీపీ ప్రభుత్వం ఒక్క పరిశ్రమ అయినా తెచ్చిందా?ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించడం వెనుక కారణాలు ఏమిటో? అన్ని అంశాలు విభజన చట్టంలో‌చేర్చిన వారు.. హోదా ఎందుకు చేర్చ లేదు?ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ ని ప్రశ్నించ లేదు?అమరావతి విషయంలో తీర్మానం చేసి… అధికారంలోకి‌ వచ్చాక రైతుల నోటిలో మట్టి కొట్టారు.

గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు‌ చేయాలని అంటున్న వారు… అమరావతి ని ఎందుకు అభివృద్ధి చేయలేదు?ఇప్పుడు ప్రత్యేకంగా ప్యాకేజీ గురించి ఎందుకు మాట్లాడారో?కేంద్రం గతంలో‌ చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్యాకేజీ కి కట్టుబడి ఉంది. హోదా వల్ల వచ్చే లాభాలను ప్యాకేజీ రూపంలో ఇస్తున్నాం.మమ్మలను నిందించే వారు… ముందు మీ మోసాలను‌ గుర్తించండి.మీకొక న్యాయం.. ఇతరులకు మరొక న్యాయమా? 151సీట్లు వచ్చాయని చెప్పుకుంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారు. యువతరాలకు భవిష్యత్తు లేకుండా చేసి… అప్పులు మిగిల్చారు.ప్రజా ధనాన్ని దోచుకున్న వైసిపి నాయకులు పోలవరం గురించి మాట్లాడరు.

గత ప్రభుత్వం అవినీతి చేసిందని పుస్తకాలు విడుదల చేశారు.వారి‌పై‌ విచారణ చేసి చర్యలు ఎందుకు తీసుకోలేదు?అభివృద్ధి అంటే తెలియని వారు మా మీద మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.ప్రజలను మరోసారి మోసం‌ చేయడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, గ్రామాల నిధులు మళ్లించారు. సలహాదారులకు జీతాలు ఇస్తారు…. ఉద్యోగస్తులకు మాత్రం జీతాలు వేయరు.వైసిపి నాయకులకు బిజెపి గురించి మాట్లాడే‌ నైతిక అర్హత లేదు.ఎపి అభివృద్ధి కోసం బిజెపి ప్రభుత్వం ‌చిత్తశుద్దితో పని చేస్తుంది.

LEAVE A RESPONSE