Suryaa.co.in

Andhra Pradesh

సెల్యూట్.. మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్

మంగళగిరి: విధి నిర్వహణలో పోలీస్ శాఖ అత్యంత విలువైన పాత్ర అనేది అందరికి తెలుసు. అలాంటి పోలీస్ శాఖలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొంగుతున్న వాగులు కాలువలు.

గుంటూరు విజయవాడ ప్రధాన రహాదారి మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వరద నీరు రోడ్డుపైకివచ్చి ట్రాఫిక్ అంతరాయం అని విషయం తెలుసుకున్న మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకట్ హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు.స్వయంగా రంగంలోకి స్థానికుల సహాయంతో వాహనాలు జాగ్రత్తగా పంపే ప్రయత్నం. అటుగా ప్రయాణం చేస్తున్న వారితో సెభాష్ పోలీస్ అనేలా చేశారు.

తమ ఆరోగ్యం ముఖ్యం కాదని ప్రజలను సేఫ్టీగా ఇళ్ళకు పంపాలని ఆయన విధి నిర్వహణకు సెల్యూట్. ఆయన ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వాహనాల్లో వచ్చే వారు రావద్దని, 2 మీటర్ల ఎత్తులో వరద నీరు ప్రవాహం ఉందని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసరం అయితే తప్పించి బయటకు రావద్దని, అసలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హితవు పలికారు.
ఏది ఏమైనా ఇలాంటి ఆఫీసర్ సమాజానికి కావాలి. భరోసా ఇస్తూ విధులు నిర్వహిస్తున్న మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకట్ కు సెల్యూట్.

LEAVE A RESPONSE