-పరిశీలనలో కృష్ణమోహన్, ఏఏరావు?
-కృష్ణమోహన్, రావుకు అవకాశం ఇస్తే స్పెషల్ కమిషనర్ హోదా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సమాచారశాఖ కమిషనర్‌గా ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిలో ఐఆర్‌ఎస్ అధికారి కోగంటి సాంబశివరావు, సమాచార శాఖ మాజీ కమిషనర్ కృష్ణమోహన్, మాజీ ఐఐఎస్ అధికారి ఏఏరావు పేర్లు కమిషనర్ పదవికి వినిపిస్తున్నాయి.
వీరిలో సాంబశివరావు గత ప్రభుత్వంలో స్కిల్ డెవల్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. జగన్ ప్రభుత్వంలో సీఐడీ వేధింపులకు గురైన అధికారులలో ఈయన ఒకరు. రైల్వే సర్వీసుకు చెందిన సాంబశివరావును, కమిషనర్‌గా నియమించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే సమాచార శాఖ మాజీ కమిషనర్ పొట్లూరి కృష్ణమోహన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన సీఎం చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు. ముక్కుసూటి అధికారి, నిజాయితీపరుడన్న పేరుంది. అధికారంలో లేని సమయంలో కూడా, చంద్రబాబు అప్పగించిన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వర్తించారు. గ్రామీణాభివృద్ధి శాఖపై మంచి పట్టు ఉంది. సెర్ప్‌లో విశేషానుభవం ఆయన సొంతం. ఒకవేళ కృష్ణమోహన్‌కు కమిషనర్ బాధ్యతలు ఇవ్వాలనుకుంటే, నిబంధనల ప్రకారం ఆ హోదాను స్పెషల్ కమిషనర్‌గా మార్చాల్సి ఉంటుంది.
ఇక పూర్తి స్థాయిలో ఢిల్లీలో పనిచేసిన, మాజీ ఐఐఎస్ అధికారి ఏఏరావు పేరు కూడా కమిషనర్ పదవికి వినిపిస్తోంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత దాసరి నారాయణరావు వద్ద ఓఎస్డీగా పనిచేసిన అంచె ఐయ్యేశ్వరరావుకు మీడియా లైజనింగ్‌లో సమర్ధుడిగా పేరుంది. చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన అధికారిగా పేరున్న రావు, గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో కొంతకాలం సెలవు పెట్టి, చంద్రబాబు కోసం పనిచేశారు. సునిశిత దృష్టి, క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు సీనియర్ జర్నలిస్టులతో ఉన్న సంబంధాలతో పబ్లిక్ పల్సు తెలుసుకోవడంలో రావుది ప్రత్యేక శైలి. ఇంగ్లీషె-హిందీ భాషలపై పట్టు ఉండటం అదనపు అర్హత. ఒకవేళ ఈయనకు కమిషనర్‌గా ఇస్తే, నిబంధనల ప్రకారం ఆ హోదాను స్పెషల్ కమిషనర్‌గా మార్చాల్సి ఉంటుంది.
‘‘రిటైరైన ఐఏఎస్, ఐఆర్‌ఎస్, ఐఐఎస్ అధికారులను కమిషనర్‌గా నియమించడానికి నిబంధనలు అంగీకరించవు. కానీ ఆ హోదాను స్పెషల్ కమిషన్ గా మార్చాల్సి ఉంటుంది. కానీ వారిని ఏ పదవులలోనయినా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంద’ని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఒకరు వ్యాఖ్యానించారు.