• ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నియమించబడిన ఉదయభానుకి శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్(చిన్ని)
• గౌరవ సిఎం చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యములో జిల్లా మరియు విజయవాడ నగర అభివృద్ధి జరగాలని ఆకాంక్షించిన నేతలు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ – లోకసభ సభ్యులు కేశినేని శివనాథ్(చిన్ని) ని విజయవాడలోని వారి కార్యాలయం నందు జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా కలిసి దుస్సలువాతో వారిని సత్కరించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులుగా నియమించబడిన ఉదయభానుకి శుభాకాంక్షలు తెలియజేసి వారిని సత్కరించారు.
ఈ సందర్భంగా లోకసభ సభ్యులు కేశినేని చిన్ని మాట్లాడుతూ… జిల్లా జనసేన అధ్యక్షులుగా సామినేని ఉదయభాను ని ప్రకటించడం ఎంతో సంతోషమని ఉదయభాను ఎన్నో సంవత్సరములనుండి జిల్లా ప్రజలతో అనుబంధం ఉందని వీరి రాకతో కూటమి జిల్లాలో మరింత బలపడుతుందని, మూడు పార్టీలు కలిసి పనిచేయాలని సిఎం చంద్రబాబు నాయుడు సారధ్యములో రాజధాని ప్రాంతములో ఉన్న జిల్లాను మరియు విజయవాడ నగర అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అని తెలిపారు.
సామినేని ఉదయభాను మాట్లాడుతూ… జిల్లా జనసేన పార్టీ బాధ్యతలు అప్ప చెప్పినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదములు తెలియచేస్తున్ననని, టిడిపి-జనసేన- బిజేపి కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేస్తానని ఉదయభాను అన్నారు.
సిఎం చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యములో కూటమి ప్రభుత్వం వల్లనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రభుత్వ పధకములు మరే ఇతర ప్రజా సమస్యలను కూటమిలో ఉన్న టిడిపి , జనసేన మరియు బిజేపి పార్టీలు సమన్వయం చేసుకొని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని కేశినేని చిన్నిని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల పవన్ కళ్యాణ్ సారధ్యములో ప్రతి పల్లెలో అభివృద్ధి పనులు వేగంగా మొదలయ్యాయని, దేశములో ఎక్కడ లేని విధముగా ఒకేసారి రూ.4500 కోట్లతో రాష్ట్రములోని 13326 పంచాయితీలలో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమములో విజయవాడ నగర జనసేన నాయకులు వక్కల గాంధీ, బడిత శంకర్ మరియు నూజివీడు నాయకులు ముత్యాల కామేష్ మరియు ఇతర విజయవాడ నగర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.