Suryaa.co.in

Telangana

సి. సి. కుంటలో ఆగని ఇసుక దందా

– 10 ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా
– పట్టించుకోని పోలీసులు…. రెవిన్యూ, మైనింగ్ అధికారులు
– ఎస్పీ, కలెక్టర్ ఆదేశాలు…. బేఖాతరు
– బెదరని ఇసుక మాఫియా ….అధికారుల అండ
– సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
మహబూబ్ నగర్ జిల్లా దేవర్ కద్ర నియోజకవర్గo సి.సి.కుంట మండలంలో ఇసుక మాఫియా మళ్ళీ రెచ్చిపోతుంది. ఇసుక మాఫియాను అరికట్టాలని ఒకవైపు జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికి, స్థానిక పోలీస్, రెవిన్యూ, మైనింగ్ అధికారులు మాత్రం ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తుండడంతో మళ్ళీ సి.సి కుంటలో ఇసుక మాఫియా రెచ్చిపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి 11.00 నిమిషాలకు ఇసుక మాఫియా దర్జాగా 10 ట్రాకర్లతో ఇసుకను పల్లమర్రి, ముచ్చింతల గ్రామాల శివారులో గల ఊకచెట్టు వాగు నుండి నర్వ, లంకాల గ్రామాలకు అక్రమంగా తరలిస్తున్నపటికి పోలీసులు, రెవిన్యూ, మైనింగ్ అధికారులు కనీసం ఇటువైపు చూడకపోవడం చూస్తే, ఇసుక మాఫియాపై సంబంధిత అధికారుల చిత్త శుద్ధి ఏమాత్రం ఉందో స్పష్టమైంది.

LEAVE A RESPONSE