– సుప్రీంకోర్టు తీర్పు
ఆంధ్రప్రదేశ్లో జీవ నదులు, నదులు, వాగులలో ఇసుకతో రాదని ఎన్జీటీ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఎన్జీటీ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ విధించిన 18 కోట్ల జరిమానా పై మాత్రం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఇప్పటివరకు ఏ కోర్టులు ఏ తీర్పులు ఇచ్చిన రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్న విషయం జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో పలుచోట్ల నదుల నుండి ఇసుకను బయటకు డంపింగ్ యార్డ్ లకు తరలించారు కొన్ని లక్షల టన్నుల ఇసుక ఈ డంపింగ్ యార్డులలో నిల్వ ఉన్నది ఈ ఇసుకను కూడా కాంట్రాక్టర్లు అమ్మకాలు జరపకుండా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏపీలో ఏ చిన్న వాగును కూడా వదలకుండా ఇసుకను తవ్వి అమ్ముకున్నారు. ఎందరో అధికార పార్టీ నాయకులు పుణ్యమా అంటూ కోట్లకు పడగలెత్తారు. సుప్రీంకోర్టు తీర్పు సక్రమంగా అమలు జరిగేటట్లు చూడాల్సిన అవసరం ఉంది.