Suryaa.co.in

Andhra Pradesh

ఇసుక రీచ్ లపై ఇసుకాసురుడు జగన్ రెడ్డి దసరా బంపర్ డిస్కౌంట్ సేల్

• రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను కొత్తగా తన తమ్ముడికి / బినామీలకు కట్టబెట్టడం కోసం జగన్ రెడ్డి ఏకంగా టెండర్ నిబంధనలు మార్చేసి, ప్యాకేజీ బిడ్ సెక్యూరిటీ సొమ్ములో కోత పెట్టి శాండ్ దసరా ధమాకా సేల్ కు తెరలేపాడు
• రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను మూడు ప్యాకేజీలుగా విభజించిన జగన్ సర్కార్ ఒక్కో ప్యాకేజీకి సంబంధించి టెండర్ డాక్యుమెంట్ ధరను అనూహ్యరీతిలో రూ.29.5 లక్షలుగా (18శాతం జీ.ఎస్.టీ కలిపి) నిర్ధారించింది
• కేవలం టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు ధర మాత్రమే ఇంత భారీ మొత్తంగా నిర్ధారించడం బహుశా దేశంలోనే ప్రప్రథమం
• ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్.హెచ్.ఏ.ఐ 16-10-2023న జార్ఖండ్ రాష్ట్రంలో సుమారు రూ.1000 కోట్ల టెండర్ కు టెండర్ డాక్యుమెంట్ ధరను కేవలం లక్షరూపాయలుగా నిర్ణయిస్తే, జగన్ సర్కార్ మాత్రం మూడు ప్యాకేజీలకు కలిపి సుమారు రూ.1500 కోట్ల విలువ చేసే టెండర్ కు సంబంధించి ఒక్కో డాక్యుమెంట్ ధరను రూ.29.5 లక్షలుగా నిర్ణయించడం గమనార్హం
• ఇది కేవలం ఇంత పెద్దమొత్తం చెల్లించి టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు చేసి, టెండర్ ప్ర్రక్రియలో ఇతరులెవరూ పాల్గొనకుండా అడ్డుకోవడం కోసం ముఖ్యమంత్రి నడిపించిన వ్యవహారం మాత్రమే
• టెండర్ డాక్యుమెంట్ ధర.. జగన్ రెడ్డి తీసుకొచ్చిన ఇతర కొత్త నిబంధనలపై తాను MSTC నోడల్ అధికారి ప్రబీర్ గోశాల్ తో మాట్లాడితే, ఏపీ ప్రభుత్వమే ఆ నిబంధనలు ఇతర వ్యవహారాలు చూస్తోందని, తమకేమీ సంబంధం లేదని చెప్పారు
• టెండర్ డాక్యుమెంట్ ధరను భారీగా నిర్ధారించడమే గాకుండా బిడ్ సెక్యూరిటీ మొత్తానికి కూడా గతంతో పోలిస్తే భారీగా కోత పెట్టారు
• 2021లో ప్యాకేజీ-1 కింద బిడ్ సెక్యూరిటీ రూ.40 కోట్లు పెడితే, ఇప్పుడు తమ్ముడు, ఇతర బినామీలకోసం జగన్ రెడ్డి దసరా సేల్ లో భాగంగా ప్యాకేజీ-1 బిడ్ సెక్యూరిటీని రూ.27 కోట్లకు తగ్గించారు
• ప్యాకేజీ-2 బిడ్ సెక్యూరిటీ 2021లో రూ.50 కోట్లుగా ఉంటే, ఇప్పుడు దాన్ని ముఖ్యమంత్రి రూ.35 కోట్లకే పరిమితం చేశారు.
• ప్యాకేజీ-3 బిడ్ సెక్యూరిటీ గతంలో రూ.30 కోట్లుంటే ఇప్పుడు రూ.15 కోట్లకే పరిమితమైంది
• గతంలో కేవలం బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ మూడు ప్యాకేజీలు కలిపి రూ.120 కోట్లుంటే, దాన్ని ఇప్పుడు కేవలం రూ.77 కోట్లకే పరిమితం చేశారు. అంటే తన బినామీల కోసం రూ.43 కోట్ల భారీ డిస్కౌంట్ ను ఈ ఏడాది దసరా సందర్భంగా జగన్ రెడ్డి ప్రకటించారు
• గతంలో 50శాతం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలన్న నిబంధనను పూర్తిగా మార్చేసి, బ్యాంక్ గ్యారెంటీ రూపంలో చెల్లిస్తే సరిపోతుందనే కొత్త నిబందన ఎవరి మేలుకోసమో ముఖ్యమంత్రి చెప్పాలి
• ప్రభుత్వం టెండర్ డాక్యుమెంట్ ధరను పెద్దమొత్తంలో ఎందుకు నిర్ధారించిందో… బిడ్ సెక్యూరిటీ మొత్తం ఎందుకు తగ్గించారో, ఇతర నిబంధనలు ఎందుకు మార్చారో మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలి
• కొత్తగా ఇసుక రీచ్ లకు సంబంధించి ప్రభుత్వం పిలిచిన టెండర్ల తాలూకా డాక్యుమెంట్స్ ను పెద్దిరెడ్డి తక్షణమే బయటపెట్టాలి
• ఇసుక అక్రమ అమ్మకాలతో నేటి వరకు దోచిన రూ.40 వేలకోట్లకు అదనంగా, తన హాయాంలో మిగిలిన 4 నెలల కాలంలో జగన్ రెడ్డి ఇంకా ఎక్కువ లూఠీ ఇసుక దోపిడీతో చేయవచ్చనుకుంటే చూస్తూ ఊరుకోం
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి

గడచిన నాలుగున్నరేళ్లలో ఇసుకాసురుడిగా పేరు పొందేలా జగన్మోహన్ రెడ్డి ఇసుక అమ్మకాల్లో భారీ దోపిడీకి పాల్పడ్డాడని, రూ.40 వేలకోట్లను అచ్చంగా ఇసుక ద్వారానే దోచేశాడని, ఆ దోపిడీతో పాటు…ఇతర కుంభకోణాలు పూసగుచ్చినట్టు ప్రజలకు ఆధా రాలతో సహా వివరించారనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఈ అవినీతి ముఖ్య మంత్రి అన్యాయంగా జైల్లో నిర్బంధించాడని, అయినప్పటికీ ఆయన చూపిన బాటలో నే నేడు మేమంతా ప్రజలపక్షాన పోరాడుతూ, జగన్ రెడ్డి అవినీతిని, కుంభకోణాలను బయటపెడుతున్నామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“2021 ఏప్రియల్ లో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారికి ఇసుక తవ్వకాల టెండర్ అప్పగించినట్టు కలరింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఆ సంస్థను డమ్మీని చేసి వైసీపీ వారితోనే రాష్ట్రంలోని ఇసుక రీచ్ లన్నింటినీ ఇష్టానుసారం తవ్వేసి తన ఖజానా నింపుకున్నాడు. 2019లో అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలలనుంచే జగన్ ఇసుకాసురుడిగా మారి తన జేబులు నింపుకోవడం మొదలెట్టాడు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకోసం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని తన దోపిడీ కోసమే జగన్ రెడ్డి రద్దు చేశాడు.

టీడీపీ ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక రూ.1200 నుంచి రూ.1500 మధ్య లభిస్తే, జగన్ వచ్చాక అదే ట్రాక్టర్ ఇసుకను రూ.7వేలనుంచి రూ.10వేల వరకు అమ్మారు. జిల్లాలవారీగా తన తాబేదార్లను నియమించుకొని భారీగా ఇసుక లూఠీకి పాల్పడ్డాడు. దీనిపైన ప్రజల నుండి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో కొత్త ఇసుక విధానం ప్రవేశపెడుతున్నానని నమ్మబలికి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ టెండర్ విధానంలో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు రాష్ట్రంలోని ఇసుక రీచ్ లన్నీ కట్టబెట్టాడు. ఆ రకంగా మే 2021 నుంచి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ అనే సంస్థను అడ్డుపెట్టుకొని తిరిగి తన దోపిడీ ముఠా ఆధ్వర్యంలోనే ఇసుకపై వేలకోట్లు మింగడం మొదలు పెట్టాడు.

జేపీ పవర్ వెంచర్స్ కు కట్టబెట్టిన టెండర్ కాలపరిమితి మే-2023తో ముగియడంతో, ఒక సంవత్సరం పాటు తిరిగి వారికే టెండర్ పొడిగిస్తున్నట్టు ప్రజల్ని మభ్యపెట్టి జగన్ అండ్ కో తమ దోపిడీని కొనసాగించారు. నేడు కొత్తగా రాష్ట్రంలోని శాండ్ రీచ్ ల నిర్వహ ణ, అమ్మకాలకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించి ఈసారి ఏకంగా తన తండ్రి సోదరుడు జార్జిరెడ్డి కుమారుడైన అనిల్ రెడ్డి మరియు ఇతర బినామీలకు రీచ్ లను కట్టబెట్టడాని కి సిద్ధమయ్యాడు.

తన తమ్ముడికి లేక తన బినామీలకు ఇసుక రీచ్ లు కట్టబెట్టి, తద్వారా నేటివరకు దోచిన దానికంటే రెట్టింపు దోపిడీ చెయ్యాలన్నదే జగన్ రెడ్డి కుట్ర
రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు ప్రారంభించిన నూతన టెండర్ ప్రక్రియకు సంబంధించి జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కీలకమైన టెండర్ డాక్యుమెంట్ ను ప్రజలకు అందు బాటులో లేకుండా చేసింది. కనీసం ఈ టెండర్లలో పాల్గొనేవారికి ఉండాల్సిన అర్హతలు మరియు ఇతర సాంకేతిక అంశాలకు చెందిన వివరాలు కూడా బయటకు రాకుండా చేయడంకోసం మాత్రమే టెండర్ డాక్యుమెంట్ ధరను జగన్ రెడ్డి అంతపెద్ద మొత్తంలో నిర్ధారించాడు.

టెండర్లలో పాల్గొనదలచిన వారు, తమకు కావాల్సిన అర్హతలు ఉన్నా యో లేదో తెలుసుకోవడానికి కూడా రూ.29.5లక్షలు చెల్లించి టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు చేసి చదువుకోవాల్సిందే. ఇది అత్యంత దుర్మార్గం. కేవలం టెండర్ అర్హత లు తెలుసుకోవడానికి ఎవరు మాత్రం రూ.29.5లక్షలు ఖర్చుచేస్తారు? తీరా అంత పెద్ద మొత్తం ఖర్చుపెట్టి టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు చేశాక, తమకు ఆ టెండర్లలో పాల్గొనే అర్హత లేదని తెలిస్తే, కట్టిన సొమ్ములో పైసా కూడా వెనక్కురాదు. ఎందువల నంటే టెండర్ డాక్యుమెంట్ ధర మొత్తం నాన్ రిఫండబుల్ కనుక.

ఇందువల్ల ఎవరూ కూడా అంతపెద్ద మొత్తంలో డబ్బుచెల్లించి టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు చేయరన్న దురాలోచనతోనే జగన్ రెడ్డి ఈ పద్ధతిని తీసుకొచ్చాడు. ఆ రకంగా తాను ముందు గానే నిర్ణయించిన వారితో మాత్రమే టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు చేయించి, తర్వాత వారికి మాత్రమే రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను కట్టబెట్టే కుట్రకు తెరలేపాడు జగన్ రెడ్డి. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన MSTC (Metal Scrap Trading Corporation) ఆధ్వర్యంలోని ఈ-ప్రొక్యూర్ మెంట్ ప్లాట్ ఫామ్ లో కేవలం నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ (NIT) అనే ఒక నామమాత్రపు డాక్యుమెంట్ ను మాత్రమే పొందుపరిచి, దానిలో టెండర్లో పాల్గొనదలచిన వారు, ఒక్కో ప్యాకేజీకి 29.5లక్షలు (జీఎస్టీతో కలిపి) చెల్లించి టెండర్ డాక్యుమెంట్ ను కొనుగోలు చేయాలని పేర్కొనడం జరిగింది.

ఆ రకంగా రాష్ట్రంలోని మూడుప్యాకేజీలకు టెండర్ డాక్యుమెంట్లు కొనుగోలు చేయాలంటే దాదాపు రూ.90లక్షలు వెచ్చించాల్సిందే. ఇంతభారీ మొత్తంలో టెండర్ డాక్యుమెంట్ ధరను దేశచరిత్రలో ఏ ప్రభుత్వం/సంస్థ నేటివరకు నిర్దారించలేదు. కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్.హెచ్.ఏ.ఐ వారు 16-10-2023న జార్ఖండ్ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి సంబంధిం చి సుమారు రూ.1000 కోట్లకు టెండర్ పిలిస్తే, దానియొక్క టెండర్ డాక్యుమెంట్ ధరను కేవలం రూ.1,00,000గా నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ, వెయ్యికోట్ల ప్రాజెక్ట్ కు టెండర్ ఫీజుగా కేవలం రూ.లక్షరూపాయలు నిర్దేశిస్తే, జగన్మో హన్ రెడ్డి, అతని అవినీతి ప్రభుత్వం మాత్రం ఇసుకకు సంబంధించిన మూడు టెండర్ ప్యాకేజీల డాక్యుమెంట్స్ యొక్క మొత్తం ధరను సుమారు రూ.90 లక్షలకు పెంచారు. మొత్తం మూడుప్యాకేజీల టెండర్ విలువ కలిపినా రూ.1500 కోట్లకు మించి ఉండదు.

గతంలో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థను అడ్డుపెట్టుకొని ఇసుక దోపిడీకి పాల్పడిన జగన్ రెడ్డి, ఇప్పుడు ఏకంగా తన తమ్ముడినే తెరపైకి తెచ్చాడు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సోదరుడైన జార్జిరెడ్డి కొడుకైన అనిల్ రెడ్డికి మరియు ఇతర బినామీ ముఠాలకు ఇసుక టెండర్లు కట్టబెట్టడంకోసం జగన్ రెడ్డి ఏకంగా టెండర్ డాక్యుమెంట్ ధరను రూ.29.5 లక్షలుగా నిర్ధారించడమే కాకుండా టెండర్ నియమ నిబంధనలన్నీ మార్చేశాడు. ఇసుక దోపిడీకోసం జగన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో ప్రజలు గ్రహిం చాలి. టెండర్ పొందే అర్హత, ఇతర నిబంధనలు ఏవీ ప్రజలకు తెలియకుండా చేయడా నికే టెండర్ డాక్యుమెంట్ ఫీజుని రూ.29.50 లక్షలుగా నిర్ణయించారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి ఏం సమాధానం చెబుతారు?

అంతకుముందే ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నవారు మాత్రమే టెండర్ డాక్యుమెంట్ కొనేలా.. వారికి మాత్రమే కాంట్రాక్ట్ దక్కేలా చేయడానికే జగన్ రెడ్డి.. పెద్దిరెడ్డి ఇలా తెరవెనుక మంత్రాంగం నడిపారు. టెండర్ డాక్యుమెంట్ ధర, ఏపీ ప్రభుత్వం ఇసుక టెండర్లకు సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై తాను MSTC నోడల్ అధికారి ప్రబీర్ గోశాల్ తో మాట్లాడితే, ఏపీ ప్రభుత్వమే ఈ వ్యవహారమంతా నడుపుతోందని, టెండర్ డాక్యు మెంట్ ఫీజు.. ఇతరత్రా వ్యవహారాలపై తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

తన వారికోసం టెండర్ బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ లో కూడా జగన్ రెడ్డి భారీ డిస్కౌంట్
గతంలో 2021లో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు ఇసుక రీచ్ లు కట్టబెట్టిన సందర్భంలో బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రాష్ట్రంలోని మూడు ప్యాకేజీలకు కలిపి, రూ.120కోట్లు వసూలు చేయడం జరిగింది. 2021లో ప్యాకేజీ-1 కింద (శ్రీకాకుళం, విశాకపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలు) బిడ్ సెక్యూరిటీ రూ.40 కోట్లు పెడితే, ఇప్పుడు జగన్ రెడ్డి దసరా డిస్కౌంట్ సేల్ సందర్భంగా ప్యాకేజీ-1 బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ ను రూ.27కోట్లకు తగ్గించారు. ప్యాకేజీ-2 కింద (పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు) బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ 2021లో రూ.50కోట్లుగా ఉంటే, ఇప్పుడు దాన్ని ముఖ్యమంత్రి తన తమ్ముడి కోసం రూ.35 కోట్లకే పరిమితం చేశారు.

ప్యాకేజీ-3 కింద (నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు) బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ గతంలో రూ.30కోట్లుంటే ఇప్పుడు రూ.15 కోట్లకే పరిమితమైంది. మొత్తంగా రాష్ట్రంలోని ఇసుక రీచ్ ల తాలూకా మూడు ప్యాకేజీల బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ గతంలో రూ.120 కోట్లుంటే, దాన్ని ఇప్పుడు కేవలం రూ.77కోట్లకే పరిమితం చేశారు. ఈ విధంగా జగన్ రెడ్డి తన బినామీ ల కోసం ఈ సంవత్సరం దసరా సందర్భంగా బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ లో రూ.43 కోట్ల భారీ డిస్కౌంట్ ను ప్రకటించాడు.

ఇది కేవలం తన వారిపై పడబోయే ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం మాత్రమే. రాష్ట్రంలోని మూడు ప్యాకేజీలలోని ఇసుక రీచ్ ల సంఖ్య తగ్గని సందర్భంలో, అందుబాటులోకి రాబోయే కోట్ల టన్నుల ఇసుక పరిమాణంలో కూడా ఏమాత్రం తేడారాని సందర్భంలో సెక్యూరిటీ డిపాజిట్ లో కోత ఎందుకు విధించారో జగన్ రెడ్డి జవాబు చెప్పాలి. బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ తగ్గించడం తో పాటు, ఇతర కొన్ని నిబంధనలు కూడా తమ్ముడు అనిల్ రెడ్డికి అనుకూలంగా ముఖ్యమంత్రి మార్చేశాడు.

గతంలో 50శాతం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలన్న నిబంధనను పూర్తిగా మార్చేసి, బ్యాంక్ గ్యారెంటీ రూపంలో చెల్లిస్తే సరిపోతుందనే కొత్త నిబందన ఎవరి మేలుకోసమో ముఖ్యమంత్రి చెప్పాలి
గతంలో 2021 ఇసుక టెండర్లలో పాల్గొని టెండర్ దక్కించుకున్న వారు, తాము చెల్లించాల్సిన బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ మూడు ప్యాకేజీలకు కలిపి రూ.120కోట్లు ఏదై తే ఉందో, ఆ మొత్తంలో 50 శాతం అనగా రూ.60 కోట్లు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లిం చాలన్న నిబంధన ఉండేది. మిగతా 50శాతం సొమ్ము మాత్రమే బ్యాంక్ గ్యారెంటీ రూపంలో చెల్లించే వెసులుబాటు ఉండేది. బ్యాంక్ గ్యారెంటీ అనేది మనం కట్టాల్సిన సొమ్ములో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే బ్యాంకులకు చెల్లించి పొందే సౌకర్యం అన్న విషయం అందరికీ తెలిసిందే.

బ్యాంక్ గ్యారెంటీ ద్వారా మనం తక్కువ మొత్తం వెచ్చించి, బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించే అవకాశముంటుంది. 2021లో కచ్చి తంగా 50శాతం బిడ్ డిపాజిట్ డీడీ రూపంలో చెల్లించి, మిగిలిన 50శాతానికి మాత్రమే బ్యాంక్ గ్యారెంటీ వెసులుబాటు కల్పించారు. కానీ నేడు జగన్ రెడ్డి నూటికినూరు శాతం అంటే బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం కూడా బ్యాంక్ గ్యారెంటీ రూపంలో సమర్పించే విధంగా టెండర్ నిబంధనలలో మార్పులు చేసి, తన బినామీలకు భారీ మేలు చేస్తున్నాడు.

నేడు విడుదల చేసిన టెండర్లలో మూడు ప్యాకేజీలకు కలిపి గతం కంటే రూ.43 కోట్ల భారీ డిస్కౌంట్ ఇచ్చి, కేవలం రూ.77 కోట్లు మాత్రమే బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటున్నారు. తీసుకునే ఆ మొత్తం కూడా పూర్తిగా బ్యాంక్ గ్యారెంటీ రూపంలో తీసుకునే అవకాశం కల్పించడంతో టెండర్ దక్కించుకున్నవారు కేవలం తమ జేబులో నుండి ఒక పదికోట్ల రూపాయలు వెచ్చిస్తే తాము సమర్పించాల్సిన రూ. 77 కోట్ల డిపాజిట్ మొత్తం బ్యాంక్ గ్యారెంటీల రూపంలో సిద్ధమైపోతుంది. ఆ విధంగా జగన్ రెడ్డి తన తమ్ముడు, ఇతర బినామీలపై ఏ మాత్రం ఆర్థిక భారం పడకుండా చిల్ల ర డబ్బులతోనే వేలకోట్ల విలువైన ఇసుక టెండర్లు దక్కేవిధంగా పథకరచన చేశాడు.

ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియలో నిర్దేశిత గడువు సమయానికి ఎవరూ బిడ్లుదాఖలు చేయనందున ఒక్క తేదీ మార్చినందుకే గగ్గోలు
నేటివరకు ప్రజల దృష్టిలోకి రానటువంటి మరొక కుట్రపూరితమైన విషయం ఏమిటం టే, 2021 ఇసుక టెండర్లలో జగన్మోహన్ రెడ్డి, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వంటి తన బినామీ సంస్థల వెసులుబాటుకోసం టెండర్ దాఖలు తేదీలను ఒకసారి కాదు ఏకంగా నాలుగుసార్లు మార్చాడు. ముందుగా ప్యాకేజీ-1 బిడ్ దాఖలుకు 04-02-2021గా తేదీని నిర్ణయించి, తర్వాత 17-02-2021కి ఒకసారి, మరలా 25-02-2021కి ఇంకోసారి, 03-03-2021కి మార్చడం జరిగింది.

ఆ విధంగా మొత్తం మూడుసార్లు తేదీలను మార్చడంద్వారా జగన్ రెడ్డి తన బినామీలకు మేలు చేశాడు. అదే విధంగా ప్యాకేజీ-2 బిడ్ దాఖలుకు ముందుగా 04-02-2021 తేదీని నిర్ణయించి తర్వాత 17-02-2021కి ఒకసారి, మరలా 25-02-2021కి మరోసారి, ఆ విధంగా మొత్తం రెండు సార్లు తేదీలు మార్చాడు జగన్ రెడ్డి. ప్యాకేజీ-3 బిడ్ దాఖలుకు ముందుగా 04-02-2021 తేదీని నిర్ణయించి తర్వాత 17-02-2021కి ఒకసారి, మరలా 25-02-2021కి ఇంకోసారి, ఆ విధంగా మొత్తం రెండు సార్లు తేదీలు మార్చి, తన బినామీలకు వెసులు బాటు కల్పించాడు.

గతంలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియ సందర్భంగా ఆనాటి ప్రభుత్వం బిడ్ దాఖలు గడువు తేదీకి ఎవరూ బిడ్ దాఖలు చేయకపోవడంతో ఒక్కసారి మాత్రమే వారం రోజుల గడువు పొడిగించినందుకు, దాన్ని తీవ్రమైన నేరంగా చిత్రీకరించి చంద్రబాబుపై తప్పుడు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించిన జగన్ రెడ్డి నేడు ఇసుక టెండర్లలో రెండు, మూడు సార్లు తేదీలను మార్చిన విషయంపై ఏం జవాబు చెప్తాడు.

ప్రభుత్వం టెండర్ డాక్యుమెంట్ అందరికీ దక్కనివ్వకుండా ఎందుకు చేస్తోందో.. బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం ఎందుకు తగ్గించారో, డిపాజిట్ మొత్తం 50శాతం డీడీ ద్వారా చెల్లింపు నిబంధనను ఎందుకు మార్చారో సంబంధిత శాఖా మంత్రి పెద్దిరెడ్డి మరియు డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకట రెడ్డి సమాధానం చెప్పాలి. గతంలో కూడా ఇలానే ఇసుక రీచ్ లకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్స్ బయటకు రాకుండా జగన్ రెడ్డి.. పెద్దిరెడ్డి వాటిని తొక్కిపెట్టారు. ఇంతకు ముదు కూడా జగన్ సర్కార్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను అప్పగించడానికి ట్రైడెంట్ కెంఫార్, కే.ఎన్.ఆర్ కన్ స్ట్రక్షన్స్ వంటి బినామీ సంస్థల్ని తెరపైకి తెచ్చింది.

ట్రైడెంట్ కెంఫార్ సంస్థకి జగన్ రెడ్డి చేసే ప్రతి కుంభకోణంలో భాగస్వామ్యం ఉంది. అది లిక్కర్ కుంభకోణమైనా.. సోలార్ స్కామ్ అయినా.. ట్రైడెంట్ కెంఫార్ సంస్థ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పుడు కూడా అలానే ప్యాకేజీల వారీగా ఏ కంపెనీలు టెండర్లు వేయాలో..ఎలా తమ్ముడు అనిల్ రెడ్డి / బినామీలకు ఇసుక రీచ్ లు అప్పగించాలో ముందే ముఖ్య మంత్రి ప్లాన్ చేసి పెట్టాడు. తన అనుమాయులకే ఇసుక రీచ్ లు అప్పగిస్తే ఇక ఎన్జీటీని, కోర్టుల్ని, పర్యావరణాన్ని పట్టించుకోకుండా ఇష్టమొ చ్చినట్టు ఇసుక తవ్వుకోవచ్చన్నదే జగన్ ఆలోచన.

కొత్తగా ఇసుక రీచ్ లకు సంబం ధించి ప్రభుత్వం పిలిచిన టెండర్ల తాలూకా డాక్యుమెంట్స్ ను పెద్దిరెడ్డి తక్షణమే బయట పెట్టాలి. వాటిలోని అర్హత తదితర అంశాలపై పొందుపరిచిన నియమ నిబంధనలు ప్రజలకు తెలియాలి. ఇసుక అనేది రాష్ట్ర సంపద. జగన్ రెడ్డి అదంతా తన సొంత ఆస్తి అన్నట్టు ఎవరికి పడితే వారికి దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోం.

గతంలో ఎటువంటి అవినీతికి తావులేకుండా రాష్ట్ర సంపద అయిన ఇసుకను అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా చంద్రబాబునాయుడు ఉచితంగా అందిస్తే, నేడు జగన్ రెడ్డి అటువంటి రాష్ట్రసంపదను తన బినామీలకు కట్టబెట్టి, ప్రజలపై మోయలేనంత భారం వేసి, వేలకోట్లు దోచుకుంటున్నాడు. ఎట్టిపరిస్థితుల్లో జగన్ రెడ్డి దోపిడీని అడ్డు కుంటాం. ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకొచ్చిన ఇసుక టెండర్లపై ఇప్పటికే కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర సంపదను జగన్ రెడ్డికి, అతని తమ్ముడికి కట్టబెట్టే వాళ్లకు ఊడిగం చేస్తానంటున్న డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డిని కూడా వదిలిపెట్టం.

నాలుగున్నరేళ్లలో 2.50లక్షల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి అవినీతి గురించి ఉపన్యా సాలు ఇస్తుంటే, ప్రజలకు నవ్వాలో, ఏడవాలో తెలియడంలేదు. లక్షలకోట్ల ప్రజల సొమ్ముని, ప్రకృతి సంపదను అప్పనంగా దిగమింగుతున్న జగన్ రెడ్డి.. తానేదో సచ్ఛీలుడు అయినట్టు, తప్పు చేయని చంద్రబాబునాయుడిపై నిందలేస్తూ, ఆయన్ని ప్రజల్లో దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు.

టెండర్ డాక్యుమెంట్ ధర ఆకాశాన్నం టేలా పెట్టడం దగ్గరనుంచీ.. టెండర్ డాక్యుమెంట్లో నిబంధనల తాలూకా సమాచారం.. బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము తగ్గింపున గల కారణం.. డీడీల రూపంలో కాకుండా బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే సరిపోతుందన్న నిబంధన వెనకున్న రహస్యం సహా అన్ని వాస్తవాలు ముఖ్యమంత్రి తక్షణం ప్రజలకు తెలియచేయాల్సిందే. తమ్ముడి కోసం జగన్ రెడ్డి తీసుకొచ్చిన ఇసుక దసరా బంపర్ డిస్కౌంట్ గుట్టంతా బయటకు రావాల్సిందే.” అని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE