– A-1గా సంజయ్
– A-2గా సాత్రిక టెక్నాలజీ
విజయవాడ: వైసీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన సీనియర్ ఐపిఎస్ సంజయ్ కు ఉచ్చు బిగుస్తోంది. సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అగ్నిమాపకశాఖ డీజీ గా ఉన్న సమయంలో సంజయ్ అవినీతికి పాల్పడ్డారని, ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ఇటీవలే సంజయ్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ప్రాథమిక సాక్ష్యాధారాల మేరకు, సంజయ్ పై ఏసీబీ కేసునమోదు చేసింది. A-1గా సంజయ్ ను, A-2గా సాత్రిక టెక్నాలజీ పేరును చేర్చింది.