-మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం
-క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని డిమాండ్
కర్నాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రయాణీకులు మ్రుతి చెందడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మ్రుతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని కోరారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.