రామాయణంలో హనుమంతుడు సంజీవని మూలిక కోసం పర్వతాన్నే మోసుకొచ్చాడు. నేడు, డిజిటల్ విప్లవం ద్వారా అదే సంజీవనిని ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లోకి, ఇంటి గడప వద్దకు తీసుకువస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇది కేవలం చికిత్స మాత్రమే కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ డేటా మేనేజ్మెంట్తో కూడిన ఒక సంపూర్ణ ఆరోగ్య రక్షణ కవచం.
ప్రపంచంలోని అత్యుత్తమ వైద్య విధానాలు, పరిశోధనలు ఇప్పుడు మన ఊరిలోనే, మన గుమ్మం ముంగిటే అందుబాటులోకి రానున్నాయి.
అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే ఏఐ డాక్టర్లు ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి, తక్షణ సలహాలు అందిస్తారు. ఇది వైద్య రంగంలో ఒక పెను మార్పుకు నాంది కాబోతోంది.
మీ ఆరోగ్య చరిత్ర మొత్తం డిజిటల్ హెల్త్ రికార్డ్స్ రూపంలో భద్రంగా ఉంటుంది. అత్యవసర సమయాల్లో పాత రిపోర్టుల కోసం వెతకాల్సిన అవసరం లేకుండా, ఒక్క క్లిక్‌తో డాక్టర్లకు మీ పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది.
కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆన్లైన్ మెడిటేషన్ (ధ్యానం) తరగతులను ఈ ప్రాజెక్టులో భాగం చేయడం విశేషం.
నాడు ఆంజనేయుడు లక్ష్మణుడి ప్రాణం నిలబెట్టడానికి సంజీవనిని తెచ్చినట్లు, నేడు ప్రజలందరికీ అత్యున్నత వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ “సంజీవని” ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. “మీ ఆరోగ్యం – మా బాధ్యత” అనే నినాదంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ దేశ ఆరోగ్య రగ్యంగంలో ఒక విప్లవాన్ని సృష్టించనుంది.