Suryaa.co.in

Andhra Pradesh

సంఘసంస్కర్తగా సంత్ సేవాలాల్ మహారాజు సేవలు అసామాన్యం

– సంత్ సేవాలాల్ 286వ జయంతి లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి: సంత్ సేవాలాల్ 286వ జయంతి సందర్భంగా సేవా ఘాట్ లో పాల్గొనడం జరిగింది. జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఆనాడు 18 వ శతాబ్దంలో ఆర్థికంగా సామాజికంగా సంఘసంస్కర్తగా మహారాజు చేసిన సేవలు అసమాన్యం. దేశంలో 10 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న బంజర సోదర సోదరీమణులు కొలిచే దైవం సంత్ సేవాలాల్ మహారాజ్.
గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో 15 వేలకు మంది పైగా బంజారా సోదర సోదరీమణులు నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టారు. 2019 ముందు ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రతి సంవత్సర 25 లక్షలు కేటాయించేవారు.

కానీ గత ప్రభుత్వంలో ఎవరు నిలదీయరు ఎవరు గుర్తించరు అని అనుకున్నారేమో గాని ఆ నిధులను పూర్తిగా ఆపేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో మళ్లీ తిరిగి 2024 లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఇచ్చే 25 లక్షలకు పెంచి ప్రస్తుతం 50 లక్షలు అందించేందుకు జీఓ ను పాస్ చేశారు. ఈ కార్యక్రమంలో హంపి పీఠాధిపతి శ్రీశ్రీ విరూపాక్ష విద్యారన్య స్వామి , రాష్ట్ర అధ్యక్షులు జగన్నాధ రావు , గుంతకల్ ఎమ్మెల్యే జయరాం పాల్గొన్నారు.

LEAVE A RESPONSE